నిర్భ‌య నిందితుల‌కు ఉరి శిక్ష… డేట్ ఫిక్స్‌

December 9, 2019 at 1:07 pm

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నిర్భ‌య దుర్ఘ‌ట‌న‌కు సంబంధించి నిందిదుతుల‌కు న్యాయ‌స్థానం ఉరిశిక్ష ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సంఘ‌ట‌న‌లో మొత్తం ఆరుగురు నిందితుల్లో ఒక‌రు గ‌తంలోనే జైలులోనే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. మ‌రో నిందితుడు మైన‌ర్ కావడంతో అత‌డిని జునైల్ హోంకు త‌ర‌లించి.. మూడు సంవ‌త్స‌రాల శిక్ష విధించారు. ఇక మిగిలిన న‌లుగురికి ఉరిశిక్ష‌ను ఖ‌రారు చేశారు.

నిందితుల‌కు క‌ఠిన శిక్ష అమ‌లు చేసేందుకు రాష్ట్రప‌తి సైతం ఓకే చెప్పేశారు. త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చిన క్ష‌మాభిక్ష పిటిష‌న్‌ను ఆయ‌న తోసిపుచ్చారు. డిసెంబర్ 16న ఉదయం 5 గంటలకు ఆ దుర్మార్గుల‌కు ఉరి వేయ‌నున్నారు. వీరిని ఉరి తీయడానికి తలారి కోసం వెతుకులాట ప్రారంభించింది జైళ్ల శాఖ. మ‌న‌దేశంలో ఉరిశిక్ష‌ల అమ‌లు త‌క్కువ కావ‌డంతో ప్ర‌భుత్వం శాశ్వ‌త త‌లారుల‌ను నియ‌మించుకోలేదు.

గ‌త 10 సంవ‌త్స‌రాల్లో కేవ‌లం న‌లుగురికి మాత్ర‌మే ఉరిశిక్ష అమ‌లు చేశారు. ఇక ఈ సంఘ‌ట‌న పూర్వాప‌రాలు ప‌రిశీలిస్తే 2012 డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో ఓ వైద్యవిద్యార్థిని (23)పై సామూహిక లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్ (17) మూడేళ్లు జైలు శిక్ష అనుభ‌వించారు. ఇక మిగిలిన వాళ్ల‌లో కేసు విచార‌ణ‌లో ఉండ‌గానే ప్రధాన నిందితుడైన రామ్‌సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

మిగిలిన న‌లుగురు ముకేశ్(29), వినయ్ శర్మ (23), పవన్ (22), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను ఖరారు చేసింది. ఇక రాష్ట్ర‌ప‌తి కూడా ఉరిశిక్ష క్ష‌మాబిక్ష తోసిపుచ్చ‌డంతో ఇప్పుడు ఉరి తేదీకి మార్గం సుగమమయినట్లేనని భావించిన జైళ్లశాఖ నిందితుల ఉరిశిక్ష అమలు కోసం తలారిని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమైంది.

నిర్భ‌య నిందితుల‌కు ఉరి శిక్ష… డేట్ ఫిక్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts