జ‌న సైనికులు కాదు… పవనే క్ర‌మ‌శిక్ష‌ణ నేర్చుకోవాలా..!

December 9, 2019 at 2:39 pm

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు చాలా ఆస‌క్తిగా మారాయి. ఈ ఏడాది ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు రెండు త‌న‌కు స‌మాన‌మేన‌ని, గెలుపు కోసం తాను ప‌రిగెట్టేది లేద‌ని ఆయ‌న ప‌లు మార్లు చెప్పుకొ చ్చారు. అయితే, తాజాగా ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఓట‌మి గురించి ప్ర‌స్తావించారు. `మీరు(పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు) క్ర‌మ‌శిక్ష‌ణగా లేక పోవ‌డం వ‌ల్లే.. పార్టీ అధికారంలోకి రాకుండా ఓడిపోయింది. మీరు క్ర‌మ శిక్ష‌ణ‌గా ఉండి ఉంటే.. పార్టీ అధికా రంలోకి వ‌చ్చి ఉండేది!`- అని ప‌వ‌న్ ఒకింత అస‌హ‌నంతోనే అన్నారు. దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు దారితీసిన‌ట్ట‌యింది. జ‌న‌సేనలో క్ర‌మ‌శిక్ష‌ణ అనేది భూత‌ద్దం పెట్టి వెతికినా క‌నిపించ‌డం లేదనేది విశ్లేష‌కుల మాట‌.

పార్టీ నాయ‌కులే క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పాటించ‌క‌పోతే.. కార్య‌క‌ర్త‌లు దీనిని ఎక్క‌డ పాటిస్తారు? అనేది విశ్లేష‌కుల అభిప్రాయం. ప్ర‌జ‌ల‌కు తానేదో సేవ చేయాల‌ని, స‌మాజంలో మార్పు చూడాల‌ని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెబుతున్న ప‌వ‌న్‌లో రాజ‌కీయ క్ర‌మ‌శిక్ష‌ణ ఉందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఆయ‌న మాట్లాడే తీరు.. నాలుగు డైలాగులు.. మూడు జోకుల‌తో.. రెండు వార్నింగులు అన్న విధంగా సాగుతోంది. దీంతో ప‌వ‌న్ ఏం మాట్లాడినా.. అభిమానులు కేరింత‌లు కొట్ట‌డం, త‌మ అభిమాన క‌థ‌నాయ‌కుడు మాట్లాడితే చా లు .. ఈల‌లు వేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఏ స‌భ‌కు వెళ్లినా.. ఆయ‌న ఏం మాట్లాడు తున్నార‌నే విష‌యంతో సంబంధం లేకుండానే కార్య‌క‌ర్త‌లు, అభిమానులు హోరెత్తిస్తున్నారు.

తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లా మండ‌పేట‌లో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్‌.. అక్క‌డి రైతుల క‌ష్టాలు వింటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రైతుల గురించి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే, ఇవేంటో కూడా ప‌ట్టించుకోని అభిమానులు ప‌వ‌న్ మాట్లుడుతున్నారు.. చాలు అనుకుని గ్యాప్ గ్యాప్‌లోనూ ఈల‌లు, చ‌ప్ప‌ట్ల‌తో హోరెత్తించారు. ఈ ప‌రిస్థితి స‌భ‌కు వ‌చ్చిన వారికి ఇబ్బంది క‌లిగించింది. దీంతో ప‌వ‌న్ ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ.. క్ర‌మ‌శిక్ష‌ణ లేనందుకే మ‌నం ఓడిపోయాం.. అని వ్యాఖ్యానించారు. అయితే, అస‌లు రాజ‌కీయంగా క్ర‌మ శిక్ష‌ణ అనేది నాయ‌కుడి నుంచే వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పార్టీ పెట్టి ఇన్నేళ్ల‌యినా.. త‌న‌కు స‌రైన ద‌శ దిశ‌నిర్దేశించుకోకుండా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌వ‌న్‌కు క్ర‌మ‌శిక్ష‌ణ ఉందా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. పేద‌ల కోసం ఏదో చేయాల‌ని భావిస్తున్న ఆయ‌న ఏనాడైనా ఆది శ‌గా మాట్లాడింది ఉందా? తాట‌తీస్తాం.. తోలు తీస్తాం.. అంటూ వ్యాఖ్య‌లు చేయ‌డం సినిమా డైలాగులు అన‌క ఏమ‌నాలి? బీజేపీని, మోడీని, షాను తీవ్ర‌స్థాయిలో తిట్టిపోసి.. మ‌ళ్లీ ఇప్పుడు వారిని ఆకాశానికి ఎత్తేయ‌డాన్ని ఏ క్ర‌మ‌శిక్ష‌ణ‌గా భావించాలి. మ‌రి త‌న‌కు లేని క్ర‌మ శిక్ష‌ణ.. బాధ్య‌త‌.. కార్య‌క‌ర్త‌ల‌కు, అందునా.. త‌న‌ను ఓ హీరోగా మాత్ర‌మే ప‌రిగ‌ణించే అభిమానుల‌కు ర‌మ్మంటే ఎక్క‌డ వ‌స్తుంది? అందుకే ముందు మారాల్సింది ప‌వ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

జ‌న సైనికులు కాదు… పవనే క్ర‌మ‌శిక్ష‌ణ నేర్చుకోవాలా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts