పీకే.. పింక్‌తో జండా పీకేసిన‌ట్లేనా..!

December 13, 2019 at 12:05 pm

పీకే.. టాలీవుడ్‌లో అంద‌రు ముద్దుగా పిలుచుకునే పేరు. అభిమానులు పిలుచునే పేరు ప‌వ‌ర్‌స్టార్‌. అయితే ఈ పీకే ఉర‌ఫ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇప్పుడు పింక్ సినిమాతో జ‌న‌సేన జెండానే పీకేసిన‌ట్లేనా..? ప‌వ‌న్ ప్ర‌మేయం లేకుండా పింక్ సినిమాకు పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి కావడం జ‌రిగింది. ఓవైపు ప‌వ‌న్ క‌ళ్యాన్ రైతు దీక్ష‌లో ఉండ‌గానే హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది పింక్ సినిమా. అయితే ఇక్క‌డ ప‌వ‌న్ క‌ళ్యాన్ ఓవైపు దీక్ష‌లు చేస్తూనే మ‌రోవైపు సినిమాల‌కు ప‌చ్చ‌జెండా ఊపార‌ని అర్థం అవుతుంది.

పింక్ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండ‌గా, వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న‌ప్ప‌టికి సెట్స్‌మీద‌కు మాత్రం జ‌న‌వ‌రిలో తీసుకు రాబోతున్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం పిబ్ర‌వ‌రితో షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నారు. అయితే పింక్ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించబోతున్నార‌న్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లో న‌టిస్తున్నారు అంటే ఇక జ‌న‌సేన జెండాను పీకేసిన‌ట్లేనా అనుమానాలు క‌లుగుతున్నాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లో న‌టించ‌న‌ని గ‌తంతో ఘంటాప‌థంగా చెప్పారు. సిని ప‌రిశ్ర‌మ‌లో త‌న ప్రస్థానం ముగిసిన‌ట్లే అని.. ఇక ముందు పూర్తిస్థాయి రాజ‌కీయాల్లోనే కొన‌సాగుతాన‌ని అన్నారు. అదే విధంగా గ‌త కొద్ది కాలం క్రితం కూడా ఏపీలో ప‌లు చోట్ల జ‌రిగిన జ‌న‌సేన స‌మావేశాల్లో నేను సినిమాల్లోకి తిరిగి వెళ్లానంటే.. ఏపీలో ప్ర‌భుత్వం బాగానే ప‌నిచేస్తుంద‌నే అనుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు. అంటే ఇప్పుడు ఏపీలో సీఎం జ‌గ‌న్ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నందునే తిరిగి సినిమాల్లోకి వెళుతున్నార‌నే టాక్ ఇప్పుడు సిని ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తుంది. ఏదేమైనా ప‌వ‌ర్‌స్టార్ రాజ‌కీయాల్లో పూర్తిగా విఫ‌ల‌మై.. ఇప్పుడు సినిమాల్లో త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకునేందుకు పింక్ సినిమాను ఎంచుకున్నారని అర్థ‌మ‌వుతుంది.

పీకే.. పింక్‌తో జండా పీకేసిన‌ట్లేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts