వైర‌ల్ గా మారిన రానా వీడియో..!

December 3, 2019 at 11:22 am

రానా ద‌గ్గుబాటి.. ఎప్పుడు సోష‌ల్ మీడియాలో బిజిగా ఉండే ప‌ర్స‌నాలిటి. నిత్యం రానా ద‌గ్గుబాటి గురించి వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంటాయి. ఇక ఇప్పటికే రానా నాలుగు నెల‌లుగా విదేశాల్లో ఉంటూ వ‌స్తున్నారు. ఈ నెల‌ల కాలంలో రానా హైద‌రాబాద్‌కు చుట్ట‌పు చూపుగా వ‌చ్చి పోతున్నారు.. కానీ ఇక్క‌డే సెటిల్ కాలేదు. అయితే ఇప్పుడు విదేశాల‌కు టాటా చెప్పి తిరిగి హైద‌రాబాద్‌లో లాండ్ అయ్యాడు. అయితే ఇప్పుడు రానా ద‌గ్గుబాటి వీడియో ఒక‌టి వైర‌ల్‌గా మారింది. ఇంత‌కాలం అనారోగ్యంతో విదేశాల్లో వైద్యం చేయించుకుని బ‌క్క‌చిక్కి పోయిన రానా.. ఇప్పుడు తిరిగి మున‌ప‌టి రానాగా మారేందుకు తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు.

రానా ద‌గ్గుబాటి రెండు కిడ్నిలు దెబ్బ‌తిన‌డంతో ట్రాన్స్‌ప్లాంటేష‌న్ కోసం విదేశాల‌కు వెళ్ళ‌డంతో అనేక ప్రాజెక్టులు మ‌ద్య‌లోనే ఆగిపోయాయి. అయితే వీటిని పూర్తి చేసేందుకు ఇప్పుడు రానా తెగ క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. పాత రానాగా మారేందుకు జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్న రానా వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అయితే ఈ వీడియో తీసింది త‌న పున‌రాగ‌మ‌నాన్ని చాటుకోవడం ఒక ఎత్తు అయితే.. మ‌రొక‌టి త‌న చిన్నాన వెంక‌టేశ్‌, భావ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన వెంకిమామ చిత్ర విడుద‌ల తేదిని ద‌ర్శ‌కుడు బాబీతో క‌లిసి ప్ర‌క‌టించడం.

అయితే ఆ సమయంలో బయటకు వచ్చిన రానా లుక్ మాత్రం అందర్నీ షాక్‌కి గురి చేసింది. పూర్తిగా బక్కచిక్కిపోయిన తమ అభిమాన హీరో లుక్ చూసి ఫ్యాన్స్ అయితే తీవ్ర కంగారు పడ్డారు. ఆ తర్వాత నుంచి రానా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో..వెంకీమామ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చెయ్యడానికి ఓ ప్రొమెషనల్ వీడియో త‌యారు చేశారు. ఈ వీడియోలో రానా జిమ్‌లో చెమటలు చిందిస్తూ కనిపించాడు. మరీ బాహుబలి టైం ఉన్నంత కాకపోయినా.. ప్ర‌స్తుతం రానా లుక్ మాత్రం సమ్‌థింగ్ బెటర్ అని చెప్పాలి. పూర్తి హెల్దీ అండ్ ఫిట్‌గా కనిపించడంతో…ఫ్యాన్స్ పుల్ జోష్‌లో ఉన్నాడు. కాగా రానా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమాను చేస్తున్నాడు. వీటితో పాటు పలు సౌత్ ఇండియన్, బాలీవుడ్ చిత్రాల్లో కూడా మన టాలీవుడ్ హంక్ మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఏదేమైనా ఈ వీడీయో చూసిన అభిమానుల‌కు ఓ గుడ్ న్యూసే అని చెప్ప‌వ‌చ్చు

వైర‌ల్ గా మారిన రానా వీడియో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts