ఆర్ ఆర్ ఆర్ నుంచి షాకింగ్ న్యూస్‌..!

December 2, 2019 at 4:30 pm

టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో చేస్తున్న చిత్ర‌మిది. బాహుబలి లాంటి చిత్రం తర్వాత రాజమౌళి మొదలు పెట్టిన సినిమా కావడం అందులోను ఇద్దరు స్టార్ హీరోలతో కలిపి ఇలాంటి భారీ ఫిక్షనల్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దీనితో ఈ సినిమాపై ఇప్పుడు ఏ చిన్న వార్త బయటకు వచ్చినా బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈసినిమాకు సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది. ఈ వార్త‌ను వింటే అది షాకింగ్‌గానే ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తి చేశార‌నే టాక్ వినిపిస్తుంది. అంతే కాదు సినిమాలో అల్లూరి సీతారామారాజుగా న‌టిస్తున్న రామ్ చరణ్ సాంగ్ బీట్ కూడా పూర్తయ్యిందని స‌మాచారం లీకైంది. ఇక ఈ సినిమాలో ముఖ్య‌మైన ఎన్టీఆర్, రామ్‌చరణ్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయని వార్తలొస్తున్నాయి. ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు ఎస్ ఎస్ రాజ‌మౌళీ సినిమా 70శాతం పూర్తి చేశాన‌ని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటూ 80 శాతం షూటింగ్ ను పూర్తి చేశారిన స‌మాచారం. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

దాదాపు బాహుబలి చిత్రానికి పనిచేసిన టీం ఆర్ఆర్ఆర్ కోసం కష్టపడుతోంది. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బాహుబ‌లి సినిమాపైన అంచనాలు పెంచేందుకు ఒక్కో పాత్రను మెల్లిమెల్లిగా బయటకు వదులుతూ సినిమాపై అటేన్షన్ ని పెంచేసాడు రాజమౌళి. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో వ‌స్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా జక్కన్న ఇదే రూల్ ఫాలో అవుతునట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే చిత్రంకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు జ‌క్క‌న్న‌.

ఆర్ ఆర్ ఆర్ నుంచి షాకింగ్ న్యూస్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts