‘ రూల‌ర్ ‘ …. బిజినెస్‌లో లాస్‌…

December 11, 2019 at 12:22 pm

బాల‌య్య క‌థ‌నాయ‌కుడిగా తెర‌కెక్కిన రూల‌ర్ సినిమా బిజినెస్ ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేక‌పోగా..నిర్మాత‌ల‌కు ఏకంగా రూ.15కోట్ల మేర న‌ష్టాలు తెచ్చిపెట్టిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాను అనుకున్న దానికంటే ఎక్కువ‌గా ఖ‌ర్చుచేసి దాదాపు రూ.40కోట్ల‌తో తెర‌కెక్కించారు. అయితే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నా శాటిలైట్ హ‌క్కుల కోసం ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో నిర్మాత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఓవ‌రాల్‌గా రూ.25కోట్ల బిజినెస్ మాత్ర‌మే అవ‌డం గ‌మ‌నార్హం.

ఇక యూఎస్‌లో బాల‌య్య సినిమాల‌కు బ‌య్యార్లు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో నిర్మాత‌లే సొంతంగా విడుద‌ల చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఆంధ్ర – తెలంగాణాలో కొన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్, కొన్ని ఏరియాల్లో అనుకున్న దానికన్నా తక్కువకి బ‌య్య‌ర్లు కొనుగోలు చేశార‌ట‌. మొత్తంగా 25 కోట్ల బిజినెస్ పూర్తైన‌ట్లు తెలుస్తోంది. బాల‌కృష్ణ హీరోగా ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించిన క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు సినిమాలు భారీ డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. ఇందులో క‌థానాయ‌కుడు భారీ మొత్తానికి బయ్యార్లు కొనుగోలు చేసి విడుద‌ల చేశారు.

అయితే పంపిణీదారుల‌కు భారీ న‌ష్టాల‌నే మూట‌గ‌ట్టింది. రూల‌ర్ సినిమా ఎన్.టి.ఆర్’ బయోపిక్ రిజల్ట్ భారీగా పడుతోంది. అయితే సినిమా బాగుంద‌నే టాక్ వ‌స్తే మ‌ళ్లీ బిజినెస్ పుంజుకునే అవ‌కాశం లేక‌పోలేద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. పక్కాగా సినిమా బాగుండి, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఈ సినిమా కలెక్షన్స్ ద్వారా, డిజిటల్ రైట్స్ పరంగా నిర్మాతలకి లాభాలు తెచ్చి పెడుతుంది. లేదంటే బాలయ్యకి ఈ ఏడాది ‘రూలర్’ రూపంలో మరో భారీ ప్లాప్ ప‌డుతుంద‌ని సినీ జ‌నాలు వ్యాఖ్య‌నిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ బ్యాక్ డ్రాప్ లో, అక్కడ సెటిల్ అయినా తెలుగు వాళ్ళ సమస్యల ఇతి వృత్తంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో బాల‌కృష్ణ ఏ మేర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తారో చూడాలి. అభిమానులు ఏ తరహాలో నందమూరి బాలకృష్ణని చూడాలనుకుంటారో అలాంటి మాస్ పోలీస్ గెట‌ప్‌తో పాటు, క్లాస్ లుక్‌లోనూ ట్రైల‌ర్లో క‌న‌బ‌డుతున్నారు. ఈ సినిమాను ఈ నెల‌ డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.

‘ రూల‌ర్ ‘ …. బిజినెస్‌లో లాస్‌…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts