స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌తో క్యాన్స‌ర్‌….

December 2, 2019 at 1:44 pm

వంట నూనెల వాడ‌కంపై కొద్దిరోజులుగా ర‌క‌ర‌కాల విష‌యాలు ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఫిల్ట‌ర్ చేసిన ఆయిల్ వాడ‌కూడ‌ద‌న్న‌ది చాలాకాలంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న విష‌యం. ఇప్పుడు మ‌రో కొత్త ఆరోగ్య సూత్రాన్ని వివ‌రిస్తూనే..హెచ్చ‌రిక కూడా చేస్తున్నారు. అదేమంటే సన్‌ఫ్ల‌వ‌ర్ మ‌రియు కార్న్ ఆయిల్‌లో  క్యాన్స‌ర్ కార‌క వ్యాధులు ఉన్నాయంటూ శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. కేవ‌లం భార‌త్ మాత్ర‌మే కాకుండా ప్ర‌పంచ అన్నిదేశాల్లో స‌న్ ప్ల‌వ‌ర్ ఆయిల్‌నే ఎక్కువ‌గా వాడుతుండ‌టం గ‌మ‌నార్హం. భార‌త్ పాటు యూర‌ప్ కంట్రీలు ఇందులో ప్ర‌థ‌మ‌మ‌ని చెప్పుకోవాలి.

పల్లీల నూనె, సన్ ఫ్లవర్ నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె.. సాధార‌ణంగా వంట‌కు వినియోగిస్తుంటారు. అయితే వీటిలో కొబ్బిరినూనె, ఆలివ్ నూనె, వెన్నలను ఉపయోగించడం మంచిదని శాస్త్ర‌వేత్త‌లు సూచిస్తున్నారు. కొబ్బ‌రి నూనెను వినియోగిస్తే మ‌రీ మంచింద‌ని నొక్కి చెబుతుండ‌టం విషయం. వాస్త‌వానికి మ‌న పూర్వీకులు కూడా వెన్న‌నే వంట‌కాల్లో విరివిగా వినియోగించే వార‌ట‌. అలాగే కొబ్బ‌రి నూనె వాడ‌కం కూడా ఇప్ప‌టికీ కేర‌ళ‌లో న‌డుస్తుండ‌టం విశేషం.
వెటిటెబుల్ బేస్డ్ ఆయిల్స్ ని ఎక్కువగా వేడి చేసినప్పుడు అవ్వి అల్డీహైడ్స్ అనే కెమికల్స్ ని విడుదల చేస్తాయి.. వీటివల్ల గుండెకి సంబంధించిన వ్యాధులే కాకుండా.. క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని స్టడీస్ చెబుతున్నాయి.

వీటి బదులుగా ఆలివ్ ఆయిల్, బటర్ ని వాడినప్పుడు తక్కువ మోతాదులో అల్డిహైడ్స్ విడుదలైనట్టు పరిశోధనల్లో తేలింది.. వెజిటెబుల్ ఆయల్స్ అన్నిటినీ వివిధ టెంపరేచర్స్ లో టెస్ట్ చేసిన తరువాతే ఈ విషయాన్ని వారు వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.  డీప్ ఫ్రైలు చేయాల‌నుకునే వారు సాధ్య‌మైనంత వ‌ర‌కు వెజిటెబుల్ ఆయిల్స్ కి బదులుగా, వెన్న, ఆలివ్ ఆయిల్స్ ని వాడుకుంటే మంచిదని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతూ ఉంటే మీరు మరిన్ని రోగాలను ఆహ్వానించేనట్టే అవుతుందని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా హోట‌ళ్ల‌లో ఇలాంటి ఆయిల్‌నే వాడుతారు కాబ‌ట్టి బ‌య‌టి ఫుడ్‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు తీసుకోక‌పోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని చెబుతున్నారు.

స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌తో క్యాన్స‌ర్‌….
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts