పెళ్లైన సంవత్సరంనికే విడాకులు తీసుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్…

December 10, 2019 at 1:01 pm

ప్రేమ పెళ్లి జరిగి ఏడాది కాకముందే ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్…తన భర్తతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమైపోయింది. కారణాలు ఏమైనా కానీ…తన భర్త, తాను పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెప్పింది. ఇలా ప్రేమ పెళ్లి ఏడాది గడువకముందే విడాకుల వరకు వచ్చింది కొత్తబంగారులోకం ఫేమ్ శ్వేతాబసు.

కొత్తబంగారులోకం సినిమా తర్వాత శ్వేతాబసుకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తోనే టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. అయితే ఎన్ని సినిమాలు చేసిన ఆమె క్లిక్ కాలేదు. ఈ లోపే ఆమె ఓ వివాదంలో చిక్కుకుంది. కాల్ గాళ్ గా దొరకడంతో ఆమె భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. ఈ తరుణంలోనే ఆమె టాలీవుడ్ లో మకాం మార్చేసి బాలీవుడ్ లోకి వెళ్లింది.

ఇక అక్కడ కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది. ఈ క్రమంలోనే రోహిత్ మిట్టల్ తో పరిచయమైంది. ఇక వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి. పెళ్లి వరకు దారితీసింది. ఇక పెళ్లి అయిపోయి మరో కొన్ని రోజుల్లో మొదటి వివాహ వార్షికోత్సవం చేసుకోవాల్సిన వీరు, ఇప్పుడు విడిపోయే స్టేజ్ కి వచ్చేశారు. ఈ మేరకు విషయాన్ని శ్వేతా బసు సోషల్ మీడియా వేదికగా చెప్పింది.

ఇంతటితో తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ…రోహిత్ తాను పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇకపై ఎవరి దారులు వారివని, కొన్ని నెలలు చూశాక విడిపోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. అలాగే ఈ ఏడాది కాలంలో మధుర జ్ఞాపకాలని అందించినందుకు రోహిత్ కు థాంక్స్ చెప్పింది. ఇప్పటినుంచి జీవితంలో రోహిత్ కు ఎప్పుడు ఓ చీర్ లీడర్ లా ఉంటానని చెప్పుకొచ్చింది.

పెళ్లైన సంవత్సరంనికే విడాకులు తీసుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts