టాలీవుడ్ నెంబ‌ర్ 1 ఎవ‌రో తేలిపోయిందిగా..!

December 11, 2019 at 3:52 pm

ప్ర‌స్తుత ట్రెండ్ ప్ర‌కారం టాలీవుడ్ నంబ‌ర్ వ‌న్ స్థానం ఏ హీరోదో తేలిపోయింది. ఇప్పుడు ఎక్క‌డ చూసినా టాలీవుడ్ నంబ‌ర్‌వ‌న్‌గా స్థానం పొందిన ఈ హీరో గురించే చ‌ర్చ జోరుగా సాగుతుంది. త‌న తండ్రి సాధించిన స్టార్ డ‌మ్‌ను కొడుకుగా అది నిల‌బెట్టుకునేందుకు ఇంత‌కాలం శ్ర‌మించిన ఈ హీరో.. ఇప్పుడు అది సాదించి తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నాడు. ఇంత‌కు టాలీవుడ్ లో నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచిన ఆ హీరో ఎవ్వ‌రు అనుకుంటున్నారు.. ఎవ్వ‌రో కాదు.. ఆయ‌నే టాలీవుడ్ ప్రిన్స్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు.

ప్ర‌స్తుతం సిని ప‌రిశ్ర‌మ‌లో ఎవరు ఔనన్నా కాదన్నా మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ 1 హీరో అనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ప‌వ‌ర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోవ‌డం, మెగాస్టార్‌ చిరంజీవితో పాటుగా బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు సీనియర్ హీరోలు కావ‌డంతో ఇక టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని మహేష్ బాబు టాప్‌హీరోగా నిలిచిపోయారు. త‌న‌తో పాటుగా నెంబ‌ర్ వ‌న్ స్థానం కోసం పోటీ ప‌డుతున్న హీరోల్లో యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ వంటి హీరోలు ఉన్నారు.

కానీ ఎవ్వ‌రు మ‌హేష్ బాబుతో పోటీ ప‌డ‌లేక పోయారు. మ‌హేష్ బాబు తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ గ‌తంలో ఎన్నోసార్లు టాలీవుడ్ నెంబ‌ర్‌వ‌న్‌గా ఉన్నారు. ద‌శాబ్ధం కాలంగా నెంబ‌ర్‌వ‌న్‌గా ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. త‌రువాత మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో నెంబ‌ర్‌వ‌న్ స్థానాన్ని అధిగ‌మించారు. త‌రువాత ఆ స్థానాన్ని మెగాస్టార్ రాజ‌కీయాల్లోకి వెళ్ళిన త‌రువాత ఆయ‌న త‌మ్ముడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెంబ‌ర్‌వ‌న్‌గా అవ‌త‌రించారు. ఆయ‌న కూడా రాజ‌కీయాల్లోకి వెళ్ళడంతో ఇప్పుడు మ‌హేష్‌బాబు ఆ స్థానాన్ని భ‌ర్తీ చేశారు. అందుకు నిద‌ర్శ‌నం 2019లో ట్వీట్ట‌ర్ దేశంలో టాప్ టెన్ హీరోల జాబితాను విడుద‌ల చేసింది. అందులో దేశంలోనే టాప్ 9గా నిలిచి తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి స్థానం సంపాదించిన ఒకే ఒక్క‌డు గా నిలిచాడు.

టాలీవుడ్ నెంబ‌ర్ 1 ఎవ‌రో తేలిపోయిందిగా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts