అసెంబ్లీలో అడ్డంగా దొరికిపోయిన వంశీ!

December 12, 2019 at 5:00 pm

గ‌న్న‌వరం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మ‌రోసారి అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు స్లిప్పులు అంద‌జేస్తూ అడ్డంగా దొరికిపోయారు. టీడీపీకి రాజీనామా చేసిన వంశీ వైసీపీలో కూడా చేర‌కుండా త‌ట‌స్తంగా ఉండిపోయిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలోనే అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌న ఎక్క‌డైనా కూర్చోవ‌చ్చ‌ని స్పీక‌ర్ త‌మ్మినేని ప్ర‌త్యేక అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. నాటి నుంచి ఓ రోజూ ఒంట‌రిగా..మ‌రోరోజూ టీడీపీ ఎమ్మెల్యేల ప‌క్క‌న కూర్చుంటూ వ‌స్తున్నారు.

అయితే నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాల్లో 2430 జీవో, మీడియా ఆంక్షలు విషయంపై చర్చ జరుగుతోంది.
అంబ‌టి రాంబాబు మాట్లాడుతున్న స‌మ‌యంలో ఏదో అంశానికి సంబంధించి వంశీ స్లిప్పులు పంప‌డం వీడియో దృశ్యాలు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యంలో జ‌రిగిన ప్ర‌భుత్వ లోపాల‌ను ఎత్తిచూపేందుకు వంశీ త‌న‌కున్న స‌మాచారాన్ని వైసీపీ ఎమ్మెల్యేల‌కు స్లిప్పుల రూపంలో అంద‌జేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

అయితే అసెంబ్లీలో ఇవాళ వంశీ వ్యవహరించిన తీరు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. వంశీని వైసీపీ మాములుగా వాడుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. వంశీ చేత త్వ‌ర‌లోనే రాజీనామా చేసి గ‌న్న‌వ‌రంలో ఉప ఎన్నిక నిర్వ‌హించాల‌ని వైసీపీ యోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అదే ఉప ఎన్నిక కోసం తాము ఎదురుచూస్తున్నామ‌ని టీడీపీ శ్రేణులు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. టీడీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పోవ‌డానికి ఐదేళ్లు ప‌ట్ట‌డానికి అనేక కార‌ణాలుండ‌వ‌చ్చు.

కానీ వైసీపీపై విసుగెత్త‌డానికి…ఐదు నెల‌లే ప‌ట్టింద‌ని, ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ వ‌ర్గాలు పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం. వంశీ విష‌యానికి వ‌స్తే రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ఆయ‌న ధీమాగా ఉన్నారు. వైసీపీలో మంచి ప్రాధాన్య‌మే ద‌క్కుతుంద‌ని ఆయ‌న న‌మ్మ‌కంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. టీడీపీని ఎంత విమ‌ర్శిస్తే వైసీపీలో అంత ప్రీయారిటీ ద‌క్కుతుంద‌నే భావ‌న‌తోనే వంశీ తోచింది చేస్తున్న‌ట్లుగా టీడీపీ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి.

అసెంబ్లీలో అడ్డంగా దొరికిపోయిన వంశీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts