బాలయ్య రత్నం తరహాలోనే వెంకీ రత్నం !

December 12, 2019 at 4:38 pm

విక్ట‌రీ వెంక‌టేశ్‌.. ఈ పేరు టాలీవుడ్‌లో తెలియ‌ని ప్రేక్ష‌కులు లేరంటే అతిశ‌యోక్తి కాదు. సిని ప్ర‌పంచంలో మూవీ మొఘ‌ల్‌గా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన కుటంబం నుంచి వ‌చ్చిన హీరో విక్ట‌రీ వెంక‌టేశ్‌. సినిమానే వెంక‌టేశ్ కుటుంబం.. ప్ర‌పంచం. సిని ప్ర‌పంచంలో టాలీవుడ్ మూవీ మొఘ‌ల్‌గా కీర్తికెక్కిన ప్ర‌ఖ్యాత నిర్మాత‌, న‌టుడు ద‌గ్గుబాటి రామానాయుడు. సురేష్ ప్రొడ‌క్ష‌న్ అనే చిత్ర నిర్మాణ సంస్థ‌ను, డిస్ట్రిబ్యూష‌న్ ను ఏర్పాటు చేసి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వెన్నెముకగా నిలిచిన వ్య‌క్తి రామానాయుడు. ఆయ‌న వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయ‌న పెద్ద కొడుకు దగ్గుబాటి సురేష్‌బాబు నిర్మాత‌గా మారాడు..

కానీ రామానాయుడు మ‌రో కొడుకు ద‌గ్గుబాటి వెంక‌టేశ్‌. విక్ట‌రీ వెంక‌టేశ్‌గా ప్రేక్ష‌కుల చేత నిరాజ‌నాలు అందుకున్న వెంక‌టేశ్ ద‌ర్శ‌కులు.. నిర్మాతల న‌టుడిగా మారాడు. అయితే న‌ట వార‌స‌త్వం నుంచి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన వెంక‌టేశ్‌కు ఇప్పుడు త‌న న‌ట‌వార‌సుడిగా ఆయ‌న కొడుకు సినిమాల్లోకి రాబోతున్నాడా.. అస‌లు వ‌స్తాడా.. రాడా.. ప్ర‌స్తుతం ఏమీ చేస్తున్నాడు అనేది పెద్ద చ‌ర్చ‌గా మారింది. సురేష్‌బాబు కొడుకు రానా ద‌గ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇవ్వ‌గా, ఇప్పుడు వెంక‌టేశ్ కొడుకు ఎంట్రీ ఎప్పుడు అని వెంకీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

వెంక‌టేశ్‌కు కొడుకు అర్జున్ ద‌గ్గుబాటి ఉన్నారు. ప్ర‌స్తుతం ఇంట‌ర్‌మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్సరం చ‌దువుతున్నాడు. అయితే అర్జున్‌ను పెద్ద‌గా ఎక్క‌డ చూసిన దాఖాలాలు లేవు. కానీ సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లే చెట్టు ఫ్రీ రిలీజ్ వేడుక‌లో త‌ళ‌క్కున‌ మెరిసారు. ఆప్పుడు క‌నిపించిన అర్జున్ త‌రువాత ఎక్క‌డా పెద్ద‌గా క‌నిపించ‌లేదు. అయితే ఇప్పుడు అర్జున్ హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే అందుతున్న స‌మాచారం ప్ర‌కారం అర్జున్ న‌ట‌న‌పై ఇష్టం లేద‌ని.. ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వాల‌న్న‌దే అర్జున్ ధ్యేయ‌మ‌ని తెలిసింది. సినిమాల్లో నటిస్తాడా లేదా అనేది అర్జున్ ఇష్ట‌మ‌ని, ఆయ‌న మేజ‌ర్ అయిన త‌రువాత.. ఉన్న‌త చ‌దువులు చ‌దివిన త‌రువాత అర్జున్ తీసుకునే నిర్ణ‌య‌మే మా నిర్ణ‌యం అని వెంక‌టేశ్ అన‌డం విశేషం.

అర్జున్‌ను మేం ఎట్టి ప‌రిస్థితుల్లో బ‌ల‌వంతం చేసేది లేదు.. ఆయ‌న న‌టించాలంటే స్వాగ‌తిస్తాం అంటూ వెంక‌టేశ్ తెలిపారు. అంటే వెంక‌టేశ్ మాట‌ల్లోని అంతర్యం ప్ర‌కారం అర్జున్ సినిమాల్లో న‌టించే అవ‌కాశాలు లేవ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ కొడుకు మోక్ష‌జ్ఞ కూడా సినిమాల్లో న‌టించ‌డం ఇష్టం లేద‌ని, వ్యాపారాలు చేసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఇద్ద‌రు పెద్ద హీరోల కొడుకులు సినిమాల్లోకి వార‌సులుగా వ‌చ్చే ప‌రిస్థితి లేకుండా పోతుంది. రాబోవు రోజుల్లో ఈ ఇద్ద‌రి వార‌సులు సినిమాల్లో న‌టిస్తారో లేదో వేచి చూద్దాం.

బాలయ్య రత్నం తరహాలోనే వెంకీ రత్నం !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts