వెంకీ మామ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… మామ‌, అల్లుడు ఆల్ టైం రికార్డు

December 14, 2019 at 10:45 am

నిజ జీవితంలో మేన‌మామ‌, మేన‌ళ్లుడు అయిన విక్ట‌రీ వెంక‌టేష్‌, నాగచైత‌న్య జంట‌గా న‌టించిన వెంకీ మామ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమా పరంగా ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా ఆ కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ వ‌ల్ల వెంకీ మామ సినిమాకు తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. వెంకటేష్ మరియు నాగ చైతన్య కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్.

దీనికి తోడు సురేష్‌బాబు భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డంతో పాటు ప్ర‌మోష‌న్ల‌తో వెంకీ మామ మొదటి రోజు సుమారు 7.16 కోట్ల షేర్ ని సాధించింది. ఇప్పటి వరకూ ఇద్దరి హీరోలకి సోలోగా మొదటి రోజు 5 కోట్ల షేర్ మార్క్ సాధించిన సినిమాలు కూడా లేవు అలాంటిది మొదటి రోజు 7.16 కోట్లు అంటే వెంకటేష్ – నాగ చైతన్య కెరీర్లోనే మొదటి రోజు కలెక్షన్స్ పరంగా నెంబర్ 1 ప్లేస్ సాధించిన రికార్డ్ వెంకీ మామ కి దక్కింది.

అయితే ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు.36 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే మ‌రో రు.29 కోట్ల షేర్ సాధిస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. వ‌చ్చే వారం రూల‌ర్‌, ప్ర‌తి రోజు పండ‌గే, ద‌బాంగ్ 3 సినిమాలు ఉన్నాయి. మ‌రి ఈ పోటీ త‌ట్టుకుని ఈ సినిమా ఎంత వ‌ర‌కు క‌లెక్ష‌న్లు సాధిస్తుందో ? చూడాలి.

‘వెంకీ మామ’ ఫస్ట్ డే ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్ వివరాలు:

నైజాం – 2.29 కోట్లు

సీడెడ్ – 1.67 కోట్లు

గుంటూరు – 0.72 కోట్లు

ఉత్తరాంధ్ర – 0.88 కోట్లు

ఈస్ట్‌ – 0.66 కోట్లు

వెస్ట్‌ – 0.35 కోట్లు

కృష్ణా – 0.37 కోట్లు

నెల్లూరు – 0.27 కోట్లు
—————————————-
ఫస్ట్ డే మొత్తం షేర్ – 7.16 కోట్లు
—————————————-

వెంకీ మామ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… మామ‌, అల్లుడు ఆల్ టైం రికార్డు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts