‘ వెంకీ మామ‌’ రివ్యూ &రేటింగ్

December 13, 2019 at 8:14 am

బ్యాన‌ర్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌
న‌టీన‌టులు: విక్ట‌రీ వెంక‌టేష్‌, అక్కినేని నాగ‌చైత‌న్య‌, రాశీ ఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్‌
మ్యూజిక్‌: థ‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప‌్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ పూడి
ద‌ర్శ‌క‌త్వం: కేఎస్‌.ర‌వీంద్ర (బాబి)
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 149 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 13 డిసెంబ‌ర్‌, 2019

విక్ట‌రీ వెంక‌టేష్ – అక్కినేని నాగ‌చైత‌న్య జంట‌గా న‌టించిన సినిమా వెంకీ మామ‌. నిజ జీవితంలో మామ అల్లుడు అయిన ఈ ఇద్ద‌రు హీరోలు వెండి తెర మీద కూడా అదే రోల్స్ పోషించారు. జై ల‌వ‌కుశ త‌ర్వాత బాబి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా ఇప్ప‌టికే టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో ఆక‌ట్టుకుంది. గత రెండు నెల‌లుగా స‌రైన రిలీజ్ డేట్ లేక వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తోన్న ఈ సినిమా వెంకీ పుట్టిన రోజు సంద‌ర్భంగా రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌రకు ఆక‌ట్టుకుంటుందో ? TJ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
ఈ సినిమా క‌థ‌లోకి వెళితే కార్తీక్ (నాగ‌చైత‌న్య‌) చిన్న వ‌య‌స్సులోనే త‌ల్లిదండ్రుల‌ను పోగొట్టుకుంటాడు. దీంతో కార్తీక్‌ను పెంచే బాధ్య‌త అత‌డి మావ‌య్య వెంక‌ట‌రత్నం (వెంక‌టేష్‌) పై ప‌డుతుంది. మేన‌ళ్లుడు కార్తీక్ కోసం వెంక‌ట‌ర‌త్నం త‌న జీవితం మొత్తం త్యాగం చేస్తాడు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల వెంకీకి చెప్ప‌కుండానే కార్తీక్ చేరాల్సి వ‌స్తుంది. అక్క‌డ కార్తీక్ అనూహ్యంగా మిస్ అవుతాడు. అస‌లు కార్తీక్ ఆర్మీలో ఎందుకు చేరాడు ? ఎందుకు మిస్ అయ్యాడు ? చివ‌ర‌కు వెంకీ త‌న మేనళ్లుడిని ఎలా కనుగొన్నాడు ? వీరి జీవితంలో పాయ‌ల్‌, రాశీ పాత్ర ఏంటి అన్న‌దే ఈ సినిమా.

విశ్లేష‌ణ :
నిజ జీవితంలో మేన‌మామ మేన‌ళ్లుడు కాంబినేష‌న్లో సినిమా అన‌గానే మ‌రో మంచి మ‌ల్టీస్టార‌ర్ సినిమా చూస్తున్నాం అన్న అంచ‌నాలు అంద‌రిలోనూ ఉంటాయి. వారి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమాలో వెంకీ – చైతు చ‌క్క‌న న‌ట‌న క‌న‌ప‌రిచారు. వీరుద్ద‌రు క‌నిపించే ఫ్రేముల‌న్ని చాలా నిండుగా ఉంటాయి. ఇక ఈ ఇద్ద‌రు హీరోల‌కు జంట‌గా న‌టించిన రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ కూడా వీరితో పోటీ ప‌డ‌డంతో పాటు ఈ రెండు జంట‌ల మ‌ధ్య కెమిస్ట్రీ కూడా చ‌క్క‌గా వ‌ర్క‌వుట్ అయ్యింది.

ఇక సినిమాలో ఈ రెండు జంట‌ల మ‌ధ్య వ‌చ్చే కామెడీ, ల‌వ్ సీన్లు, సాంగ్స్ అన్ని ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి. ఇక ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించిన ప్రకాష్ రాజ్, నాజర్ మరియు రావు రమేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పిస్తారు. ఇక స‌హ‌జంగానే సినిమాపై భారీ అంచ‌నాలు ఉంటాయి. అయితే ప్ర‌తి విష‌యంలోనూ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వ‌స్తుంటుంది. దీంతో సినిమా చూసే ప్రేక్ష‌కుడికి ఒకానొక ద‌శ‌కు వెళ్లాక ఇన్ని ప్లాష్ బ్యాక్ సీన్లు ఏంట్రా బాబు అన్న ఫీలింగ్ వ‌చ్చేస్తుంది.

ఒక దాంల్లోనే మ‌రో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ వ‌స్తుంటాయి. చివ‌ర‌కు డైరెక్ష‌న్ అంతా ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ల‌కే ప‌రిమిత‌మైందే ? అన్న సందేహాలు కూడా వ‌స్తాయి. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే గంద‌ర‌గోళంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అర్థం కాదు. బాబి స్క్రీన్ ప్లే పై మ‌రింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే కామెడీ సీన్లు… ఇంట‌ర్వెల్ త‌ర్వాత వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్లు బాగున్నాయి.

సినిమాలోని ఎమోష‌న్సే బాగా హైలెట్ అయ్యాయి. క్లైమాక్స్ లోని చైతు మరియు వెంకీల మధ్య ఎమోషనల్ సీన్ అయితే చిత్రానికి ప్రధాన బలం అని చెప్పొచ్చు. కామెడీ, ఎమోష‌న్స్ ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే గంద‌ర‌గోళం వ‌ల్ల చాలా చోట్ల ప్రేక్ష‌కుడికి ఏం జరుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి.

ఇక సాంకేతికంగా చూస్తే థ‌మ‌న్ ఇచ్చిన పాట‌లు, నేప‌థ్య సంగీతం రెండూ క‌రెక్టుగా సెట్ అయ్యాయి. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. ఎక్కువుగా క్లోజ‌ప్ షాట్లే కావ‌డంతో బాగా డిజైన్ చేసుకున్నాడు. ఎడిటింగ్ బాగున్నా సెంటిమెంట్ సీన్ల‌లో కాస్త ల్యాగ్ అయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు మాత్రం అప్ టు మార్క్ ఉన్నాయి.

ప్ల‌స్‌లు (+) :
– వెంకీ – చైతు కామెడీ
– రాశీఖ‌న్నా – పాయ‌ల్ రాజ్‌పుత్ కెమిస్ట్రీ
– సెంటిమెంట్ సీన్లు

మైన‌స్‌లు ( – ) :
– కొన్ని చోట్ల గంద‌ర‌గోళ స్క్రీన్ ప్లే
– సాగ‌దీత స‌న్నివేశాలు
– కీల‌క స‌న్నివేశాల్లో చేతులు ఎత్తేసిన డైరెక్ష‌న్‌
– సెకండాఫ్‌

ఫైన‌ల్‌గా…
ఎన్నో అంచ‌నాల‌తో వ‌చ్చిన మేన‌మామ‌, మేన‌ళ్లుడు మ‌ల్టీస్టార‌ర్ కామెడీ, సెంటిమెంట్ ప‌రంగా వ‌ర్క‌వుట్ అయినా.. హీరోయిన్ల‌తో ఈ ఇద్ద‌రు హీరోల కెమిస్ట్రీ బాగున్నా… స్లో నెరేష‌న్‌, స్క్రీన్ ప్లే క‌న్‌ఫ్యూజ‌న్‌, ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ప‌దే ప‌దే రావ‌డంతో ప్రేక్ష‌కుడికి కాస్త అస‌హ‌నం క‌లుగుతుంది. ఓవ‌రాల్‌గా వెంకీ మామ జ‌స్ట్ ఓకే. మ‌రి రు. 33 కోట్ల టార్గెట్‌తో యావ‌రేజ్ టాక్‌తో బాక్సాఫీస్ జ‌ర్నీ స్టార్ట్ చేసిన వెంకీ మామ ఏం చేస్తుందో ? చూడాలి.

వెంకీ మామ TJ రేటింగ్‌: 2.75 / 5

‘ వెంకీ మామ‌’ రివ్యూ &రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts