టెన్ష‌న్ పెడుతోన్న ‘ వెంకీ మామ ‘ ఇన్‌సైడ్ టాక్‌

December 11, 2019 at 11:17 am

నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య వెండితెర మీద కూడా అదే క్యారెక్టర్ల‌లో నటిస్తున్న సినిమా వెంకీ మామ. కేఎస్‌. రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కిన‌ ఈ సినిమా గత రెండు నెలలుగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఎట్టకేలకు వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 13వ తేదీన వెంకీమామ గ్రాండ్‌గా థియేటర్లలోకి దిగుతోంది. ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి వస్తుండడంతో ఎక్కడిక‌క్కడ సినిమా ప్రమోషన్లో జోరందుకున్నాయి.

వాస్తవానికి టాలీవుడ్ లో గత నాలుగు నెలల్లో చూస్తే రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. నాలుగు నెలల నుంచి థియేటర్లు కలెక్షన్లు లేక బోసిపోతున్నాయి. ఈ లోటును వెంకీమామ తీరుస్తుందని సినిమా వర్గాలు, ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆశతో ఉన్నాయి. నాగచైతన్య సరసన రాశికన్నా, వెంకీ సరసన పాయ‌ల్ రాజ్‌పుత్‌ జంటగా నటించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చిన ఇన్సైడ్ టాక్ అందర్నీ టెన్షన్ పెడుతోంది.

సెన్సార్ నుంచి యూ / ఏ స‌ర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఫ‌స్టాఫ్ చాలా స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతుంద‌ట‌. వెంకీ ప్రేమ కోసం చైతు ఇచ్చే డెరెక్ష‌న్‌, అటు ప్రేమ కోసం వెంకీ పాట్లు ఇలా కామెడీతో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ట‌. అయితే సెకండాఫ్‌లో మాత్రం భారీ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఎమోష‌న‌ల్ సీన్లు ఓవ‌ర్ డోస్ అయ్యాయ‌ని కూడా అంటున్నారు.

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారి భారీ ఎమోషనల్ సీన్స్ ను చూడటానికి అంత‌గా ఇష్ట‌ప‌డ‌డం లేదు. మ‌రి ఈ నేప‌థ్యంలో బాబి ఈ ఎమోష‌న‌ల్ సీన్ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎలా క‌నెక్ట్ చేస్తాడు ? ఎలా కుర్చీలో కూర్చోపెడ‌తాడు అనే దానిపైనే ఈ సినిమా విజ‌యం ఆధార‌ప‌డి ఉంది.

టెన్ష‌న్ పెడుతోన్న ‘ వెంకీ మామ ‘ ఇన్‌సైడ్ టాక్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts