సుఖం కావాలంటే సిగ్గు ప‌డోద్దు…

December 3, 2019 at 10:17 am

ప‌డ‌క‌గ‌దిలో అర‌మ‌రిక‌లు లేని దాంప‌త్య జీవిత‌మే శృంగారంలో మ‌క‌రందాన్ని జుర్రుకోవ‌డానికి దోహ‌దం చేస్తుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శృంగార జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే ప‌డ‌క గ‌దిలో సిగ్గు, బిడియం, మొహమాటం అనే పదాలను దరి చేరకుండా ఉండనీయటమే అసలు మందు చెబుతున్నారు. చాలామంది భాగ‌స్వాములు శృంగారంలో సరిగమలు అని మొదలు పెట్టి, చివర్లో పదనిసలు దక్కడం లేదని వాపోతుంటారు. అయితే దీనికి పరిష్కారం మనసు విప్పి మాట్లాడుకోవడమే అని వైద్య నిపుణులు తేల్చిచెబుతున్నారు.

స్త్రీ అయినా..పురుషుడైనా భాగ‌స్వామికి తృప్తిని ఇవ్వ‌డం అన్న‌ది ఎంతో ముఖ్యం. అయితే సంతృప్తిక‌ర‌మైన శృంగారం అనే అంశంపై భాగ‌స్వామితో క‌నీసం చ‌ర్చించుకోవ‌డానికి బిడియం, సిగ్గుతో కోరిక‌ల‌ను దాచేసుకుంటున్న జంట‌ల‌ను ఇటీవ‌ల అధ్య‌య‌న వేత్త‌లు గుర్తించారు. దాదాపు 4800జంట‌ల‌తో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధన బృందం మాట్లాడింది. వారితో ప‌డ‌క‌గ‌దిలో ఎట్లా ఆ విష‌యం మా వారితో చెప్పేది అంటూ మ‌హిళ‌లు సిగ్గును వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా శృంగారంలో పార్ట్ నర్‌కు తృప్తి అందించామా లేదా అనేది, పురుషులకు కలిగే అసలైన సమస్య. అలాగే స్త్రీలలో సైతం తమకు సంతృప్తి కలగకపోయినా ఓపెన్ అయి తమ పార్ట్ నర్ తో చ‌ర్చిస్తేనే ఈస‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని చెబుతున్నారు.

ప‌డ‌క‌గ‌దిలో భ‌ర్త‌తో అర‌మ‌రిక‌లు లేని..బిడియ‌, సిగ్గును వ‌దిలిపెడితేనే శృంగార జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు. అంతేకాదు దంపతులు ప్రతీఏడాది హనీమూన్ ప్లాన్ చేసుకోవాలని, అప్పుడే దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే దంపతులు ఇరువురు తమకు కలుగుతున్న అసౌకర్యాలను ఓపెన్‌గా డిస్కస్ చేసుకోవడం ద్వారా, సమస్యలు దూరమవుతాయని పరిశోధకులు తెలిపారు.
విద్యావంతుల్లో కూడా ఇలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. అందుకే సెక్స్ ఎడ్యుకేష‌న్ అనేది కూడా అవ‌స‌ర‌మ‌ని స‌ర్వే బృందం ఉద్ఘాటించింది.

సుఖం కావాలంటే సిగ్గు ప‌డోద్దు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts