స‌మ‌యం లేదు మిత్ర‌మా.. సాగ‌దీత‌లొద్దు.. వైసీపీలో గంట‌ల వ్య‌వ‌ధే..!

December 9, 2019 at 10:31 am

ఏపీ అదికార పార్టీ వైసీపీలో రాజ‌కీయాలు రోజు రోజుకు ప‌దును తేలుతున్నాయి. నాయ‌కులు త‌ప్పు చేసినా.. ఒప్పు చేసినా.. అధినేత జ‌గ‌న్ వెంట‌నే స్పందిస్తున్నారు. స‌హ‌జంగా రాజ‌కీయాల్లో ఏ నేత విష‌యంలోనైనా ఏ పార్టీ అయినా వెంట‌నే స్పందిం చ‌దు. కొంత స‌మ‌యం తీసుకుంటుంది. స‌ద‌రు నాయ‌కుడు త‌నంత‌ట త‌నే తెలుసుకుంటాడ‌నో.. లేక వివాదం ఇంకా ముద‌ర‌లే దు క‌దా.. అనే వేచి చూసే ధోర‌ణో తెలియ‌దు కానీ.. కొన్ని పార్టీ నిర‌స‌న గ‌ళం వినిపించిన నాయ‌కుల‌పై కూడా ఏమీ అన‌లేని ప‌రిస్థితిని తెచ్చుకున్నాయి. ఫ‌లితంగా త‌ర్వాత ప‌రిస్థితులు చేతులు దాట‌డం.. పూర్తిగా ఇబ్బందులు కొని తెచ్చుకోవ డం వంటి, అంతిమంగా పార్టీకి ఇబ్బంది క‌ర ప‌రిస్థితి ఏర్ప‌డడం మ‌నం చూసిందే.

గ‌తంలో టీడీపీ అధికారంలో ఉండ‌గా ప‌లువురు ఎమ్మెల్యేలు ఇష్టాను సారం వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త కూడా వ‌చ్చింది. ఇక‌, పార్టీలోనూ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. అయినా కూడా పార్టీ అధినేత చంద్ర‌బాబు అలాంటి వారిపై చ‌ర్య‌లకు ఉపేక్షించారు. నాన్చుడు ధోర‌ణిని అవ‌లంబించార‌నే పేరు తెచ్చుకున్నారు. అయినా కూడా చంద్ర‌బాబు చ‌ర్య‌ల జోలికి వెళ్లేలేదు. ఫ‌లితంగా పార్టీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రావ‌డంతోపాటు ఓటు బ్యాంకు కూడా గ‌ల్లంతై.. పార్టీ ఓట‌మిని చ‌విచూడాల్సి వ‌చ్చింది. కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అదినేత జ‌గ‌న్ మాత్రం పార్టీని, ప్ర‌భుత్వాన్ని కూడా స‌మ‌తుల్యంగా ముందుకు సాగిస్తున్నా రు. పాల‌న‌లో ఎలాంటి చ‌ర్య‌లు, దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారో.. పార్టీ విష‌యంలోనూ అలానే ఉన్నారు.

తోక‌ఝాడిస్తున్న నాయ‌కుల‌పై ఎలాంటి ఆల‌స్యం చేయ‌కుండానే జ‌గ‌న్ చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మిస్తున్నారు. నాయ‌కులు ఎంతటి వారైనా కూడా పార్టీ నియ‌మ నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబడి ఉండాల‌నే గ‌ట్టి సంకేతాల‌ను ఆయ‌న ఆది నుంచి కూడా పంపిస్తున్నారు. ఈ విష‌యంలో నెల్లూరు నేత‌ల‌పై ఇప్ప‌టికే జ‌గ‌న్ కొర‌డా ఝ‌ళిపించారు. కొన్నాళ్ల కింద‌ట ఓ పత్రి క ఎడిట‌ర్‌ను దూషించ‌డంతోపాటు, ఓ మ‌హిళా ఎంపీడీవోపై తీవ్రంగా వ్య‌వ‌హ‌రించిన నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డిపై జ‌గ‌న్ ఆఘ‌మేఘాల‌పై స్పందించారు. వాస్త‌వానికి ఆ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ఆయ‌న ఢిల్లీలో ఉన్నారు. అయినా కూడా అక్క‌డి నుంచి ఆదేశాలు ఇచ్చి కోటంరెడ్డిని అరెస్టు చేయాల‌ని, కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. ఈ ప‌రిణామంతో ప్ర‌తిప‌క్షాల నోటికి తాళం వేసిన‌ట్ట‌యింది.

అదేవిధంగా, ప్ర‌కాశం జిల్లాకు చెందిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కూడా పార్టీని అడ్డుపెట్టుకుని అధికారులు, విలేక‌ర్ల‌పై దురుసుగా దూకుడుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించిన జ‌గ‌న్‌.. ఆయ‌న‌కు ఇప్ప‌టికే రెండు సార్లు వార్నింగ్ ఇచ్చినంత ప‌నిచేశారు. ఇక‌, ఇప్పుడు పార్టీలో ఉండాలంటే నిదానంగా ఉండాల‌ని చెబుతు న్నారు. అదేవిధంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న జిల్లా, నియోజ‌క‌వ‌ర్గాల పార్టీ ఇంచార్జ్‌ల‌పైనా జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయ‌కుడు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి విష‌యంలోనూ జ‌గ‌న్ ఇదే త‌ర‌హా దూకుడు ప్ర‌ద‌ర్శించారు.

నెల్లూరు న‌గ‌రాన్ని గూండాల‌కు అప్ప‌గించారు. మాఫియా రాజ్యం ఏలుతోంది. అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌స్థాయిలో ఫైరైన జ‌గ‌న్ ఆయ‌న‌ను దాదాపు సాగ‌నంపేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం షోకాజ్ నోటీసులు పంపారు. దీనిని బ‌ట్టి ఆయ‌నను స‌స్పెండ్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. మొత్తానికి పార్టీని క‌ట్టుబాటులో ఉంచ‌డంలో స‌మ‌యం లేదు మిత్ర‌మా!! అనే త‌ర‌హాలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు .. ప్ర‌జాస్వామ్య వాదుల మ‌న్న‌న‌ల‌ను పొందుతుండ‌డం గ‌మ‌నార్హం.

స‌మ‌యం లేదు మిత్ర‌మా.. సాగ‌దీత‌లొద్దు.. వైసీపీలో గంట‌ల వ్య‌వ‌ధే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts