గోకరాజు వైసీపీ ఎంట్రీ వెనుక బాబు ఇళ్లు కూలగొట్టడమేనా..?

December 9, 2019 at 11:33 am

ఇప్పటివరకు ఏపీలో టీడీపీ, జనసేన నేతలు వైసీపీ లేదా బీజేపీల్లోకి వలసలు వెళ్లడమే చూశాం. కానీ ఇప్పుడు ఓ మాజీ బీజేపీ ఎంపీ వైసీపీలోకి వెళ్ళడం రాష్ట్ర రాజకీయాలని ఆశ్చర్యపరుస్తుంది. అసలు బి‌జే‌పికి వీరవిధేయుడుగా, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఫుల్ గా ఉన్న గోకరాజు గంగరాజు ఫ్యామిలీ వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి కారణాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు బీజేపీ పెద్దలతో టచ్ లో ఉండటంతో, ఈయనకు చెక్ పెట్టేందుకు గోకరాజుని వైసీపీలోకి తీసుకొస్తారని ప్రచారం జరుగుతుంది.

కానీ అసలు కారణాలని లోతుగా పరిశీలిస్తే చంద్రబాబు ఇల్లు కూల్చడమే టార్గెట్ గా గోకరాజుని వైసీపీలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కరకట్ట వద్ద చంద్రబాబు నివాసముంటున్న ఇల్లు అక్రమ కట్టడమని జగన్ ప్రభుత్వం దాన్ని కూల్చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్కడే గోకరాజు గెస్ట్ హౌస్ కూడా ఉంది. దీంతో వారివి పడగొట్టి తమ నాయకుడు నివాసముంటున్న ఇంటి జోలికి రావాలని టీడీపీ నేతలు ఎప్పటి నుంచి వాదిస్తున్నారు. దీంతో వైసీపీ దీనిపై కొంచెం వెనక్కి తగ్గింది.

ఈ క్రమంలోనే గోకరాజుని వైసీపీలోకి రాగానే ఆయన గెస్ట్ హోసూ కూల్చేసి దానికి బదులుగా వేరే చోట సీఆర్‌డీఏ ప‌రిధిలోనే మంచి స్థలం ఇవ్వాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గోకరాజు గెస్ట్ కూల్చేస్తే చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇల్లు కూల్చడం పెద్ద లెక్క కాదు. అందుకే గోకరాజుని వైసీపీలోకి తెచ్చి, ఆయనని మంచిగా ఒప్పించి వేరే చోట గెస్ట్ హౌస్ కట్టుకునేందుకు స్థలం ఇచ్చి, ఇక్కడ ఉన్నదాన్ని కూల్చేయాలి అనుకుంటున్నారు.

ఇదేగాక గోకరాజు వైసీపీలోకి వస్తే ఆయన తనయుడుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఉండి’ సీటు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సుముఖంగా ఉందని తెలుస్తోంది. అలాగే గోకరాజుకు రాజ్యసభ హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి గోకరాజు వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి చంద్రబాబు ఇళ్లు కూల్చడమే లక్ష్యమని తెలుస్తోంది. అదే టైంలో జ‌గ‌న్‌కు కంట్లో న‌లుసులా మారిన న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజుకు చెక్ పెట్ట‌డం కూడా ఇందులో మ‌రో వ్యూహంగా క‌నిపిస్తోంది.

గోకరాజు వైసీపీ ఎంట్రీ వెనుక బాబు ఇళ్లు కూలగొట్టడమేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts