రాజుగారి విందుకి వైసీపీ ఎంపీలు డుమ్మ !

December 12, 2019 at 10:58 am

వైసీపీ అధినేత , ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి హెచ్చ‌రిక‌ల‌ను ఆ పార్టీ న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు గారు చాలా లైట్ తీసుకున్న‌ట్లే క‌న‌బ‌డుతోంది. బుధ‌వారం రాత్రి ఢిల్లీలో ఆయ‌న దేశ ప్ర‌ముఖులు..ముఖ్యంగా అన్ని పార్టీల‌కు చెందిన ఎంపీలు, రాజ్య‌స‌భ స‌భ్యుల‌కు భారీ విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందుకు సంబంధించిన ఎలాంటి అనుమ‌తి వైసీపీ అధిష్ఠానం నుంచి ఆయ‌న తీసుకోలేద‌ని తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని రాజుగారి వ‌ద్ద ప్ర‌స్తావిస్తే వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు పార్టీ అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని సింపుల్ కొట్టిపారేశార‌ట‌.

ఇదిలా ఉండ‌గా గ‌త కొద్దిరోజుల క్రితం నుంచే తాను ఇచ్చే విందు గురించి సోష‌ల్ మీడియాలో రాజుగారు విప‌రీతంగా ప్ర‌చారం చేశారు. తాను ఇచ్చే విందుకు ప్ర‌ధానిమోదీ, అమిత్‌షాతో పాటు చాలా మంది ప్ర‌ముఖులు వ‌స్తున్నారంటూ ఊద‌రగొట్టారు. వాస్త‌వంలో మాత్రం అంత సీన్ లేద‌ని తేలిపోయింది. కేంద్ర‌మంత్రి రాజ్‌నాథ్‌సింగే కార్య‌క్ర‌మంలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. ఇక అదే స‌మ‌యంలో వైసీపీ అగ్ర‌నేత‌లు కినుక వ‌హించార‌ట. మాట‌మాత్రంగానైనా అనుమ‌తి కోరాల్సింది…అని రాజుగారిపై కొంత కోపంతో ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే రాజు గారు మాత్రం ఇది పూర్తిగా త‌న వ్య‌క్తిగ‌త విషయానికి సంబంధించింద‌న్న‌ట్లుగా త‌న స‌న్నిహితుల‌తో పేర్కొన‌డం ఇప్పుడు గ‌మ‌నార్హం.

వైసీపీ ఎంపీ హోదాలో రాజుగారు ఇచ్చిన ఈవిందులో పార్టీ స్పెష‌ల్ ట్రీట్‌మెంట్ ఎక్క‌డ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. విందులో.. వైసీపీ ఎంపీల సందడి క‌నిపించ‌లేదు. నిజానికి.. ఈ విందు .. బీజేపీ రాజకీయాల్లో భాగమన్న చర్చ మొద‌టి నుంచి జరిగింది. ఇక ఈ విందుకు వైసీపీలో నెంబ‌ర్ 2గా భావిస్తున్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి హాజ‌రు కాలేదు. ఎవ్వ‌రూ వెళ్ల‌కుండా బాగోద‌నుకున్నారో ఏమో గాని ఎంపీ మిథున్‌రెడ్డి విందుకు హాజ‌ర‌య్యారు. అయితే గ‌త కొద్దిరోజులుగా రాజుగారు త‌రుచూ కేంద్ర‌మంత్రుల‌ను క‌లుస్తుండ‌టం…బీజేపీ అగ్ర‌నాయ‌కుల‌తో రాసుకుపూసుకు తిర‌గ‌డం వైసీపీ అధిష్ఠానానికి ఏమాత్రం మింగుడు ప‌డ‌టం లేదు. రాజుగారిని ఎలా క‌ట్ట‌డి చేయాలో అర్థంకాక అధిష్ఠానం పెద్ద‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

రాజుగారి విందుకి వైసీపీ ఎంపీలు డుమ్మ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts