వైసీపీలోకి మ‌రో బీజేపీ రాజుగారు…

December 11, 2019 at 10:02 am

మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీలోకి వెళ్లేందుకు అంతా సెట్ చేసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఆయ‌న బీజేపీకి కొద్దికొద్దిగా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అదే స‌మ‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌శంసిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల విశాఖ‌కు మెట్రో రైలు ప్రాజెక్టు చేప‌ట్టాల‌ని సీఎం జ‌గన్మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యం తీసుకోవ‌డంపై ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేయ‌డంతో పాటు జ‌గ‌న్‌ను పొగిడేశారు. అంత‌కు ముందు ఇంగ్లీష్ మీడియం బోధ‌న‌పై కూడా బీజేపీ వ్య‌తిరేకించ‌గా జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని విష్ణుకుమార్ రాజు స‌మ‌ర్థించారు.

నిరుపేద‌ల విద్యార్థుల‌కు కూడా కార్పొరేట్ విద్య అందుతుంద‌ని బంగారు భ‌విష్య‌త్‌కు పాదులు ప‌డ‌తాయంటూ వ్యాఖ్య‌నించారు. ప్ర‌భుత్వ విధానాలు, నిర్ణ‌యాల‌పై బీజేపీ నేత‌లు రోజూ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తుండ‌గా రాజు గారు మాత్రం జ‌గ‌న్‌కు జైకొట్టి మెచ్చుకోవ‌డం ఇప్పుడు ఆయ‌న పార్టీ మార‌బోతున్నారా..? అనే అనుమానాల‌కు బ‌లం చేకూరుస్తోంది. గొక‌రాజు గంగ‌రాజు కుటుంబం వైసీపీలో కొన‌సాగుతోంది. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు కూడా వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎదిగే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డం, ఎలాంటి ప‌ద‌వుల్లేకుండా ఖాళీగా ఉండ‌టం విష్ణుకుమార్ రాజుగారికి న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తోంది. అదే పార్టీ మారితే వైసీపీలో ఆక్టివ్‌గా ప‌నిచేసే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని, క‌ల‌సి వ‌స్తే ప‌దవులు కూడా ల‌భిస్తాయ‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే పార్టీ మారేందుకు సిద్ధ‌ప‌డే వైసీపీకి అనుకూలంగా….బీజేపీకి దూరంగా ఉంటున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఆయన అనుచరులు మాత్రం అట్లాందేమీ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని కొట్టిపారేస్తున్న‌ట్లు స‌మాచారం. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే నైజం రాజు గారిదని స‌మ‌ర్థించుకు రావ‌డం విశేషం.

విశాఖ ప్రగతి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం జగన్ సర్కార్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నపుడు సానుకూలంగా స్పందించడంతో తప్పులేదని చెబుతున్నారు. అయితే రాజు గారి మాటల వెనక మతలబు ఏదో ఉండి ఉంటుందన్న విశ్లేష‌ణ మాత్రం రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది. మ‌రి కొద్దిరోజులు ఆగితే గాని రాజు గారు క‌మలం పార్టీలోనే కొన‌సాగుతారా..? ఫ‌్యాన్ పార్టీలోకి వెళ్తారా..? అనేది తెలుస్తుంది.

వైసీపీలోకి మ‌రో బీజేపీ రాజుగారు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts