మూడు రాజధానులపై హైకోర్టు కీలక నిర్ణయం…

January 23, 2020 at 3:37 pm

మూడు రాజధానులు, సి‌ఆర్‌డి‌ఏ రద్దుపై అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బిల్లులు ఏ దశలో ఉన్నాయని హైకోర్టు ప్రభుత్వ తరుపున న్యాయవాదిని అడిగి తెలుసుకున్నారు. బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొంది…మండలి నుంచి సెలక్ట్ కమిటీకి వెళ్ళాయని, ఆ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని ప్రభుత్వ తరుపున ఏజీ వివరణ ఇచ్చారు. దీంతో ఈ బిల్లులపై విచారణ జరగాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది.

అయితే ప్రభుత్వం ఈలోపు కార్యాలయాలని తరలించే అవకాశం ఉందని, విచారణ జరపాలని పిటిషనర్ల తరుపు న్యాయవాది చెప్పారు. ఇక దీనిపై హైకోర్టు స్పందిస్తూ విచారణ పూర్తయ్యేలోపు కార్యాలయాలు తరలిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పింది. ఇక ఈలోపు రాజధానిలో కార్యాలయాలని తరలించకూడదని పరోక్షంగా చెబుతూ తదుపరి విచారణని ఫిబ్రవరి 26కు వాయిదా పడింది. దీంతో హైకోర్టు నిర్ణయం నెల రోజుల పాటు వాయిదా పడింది.

మూడు రాజధానులపై హైకోర్టు కీలక నిర్ణయం…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts