అల్లు అర్జున్ ‘అల వైకుంఠ‌పుర‌ములో’ రివ్యూ &రేటింగ్

January 12, 2020 at 4:46 pm

బ్యాన‌ర్‌: హారిక హాసిని & గీతా ఆర్ట్స్‌
న‌టీన‌టులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, నివేధా పేతురాజ్‌, ట‌బు, ముర‌ళీశ‌ర్మ‌, సుశాంత్‌, జ‌య‌రాం, స‌ముద్ర‌ఖ‌ని, వెన్నెల కిషోర్‌, సునీల్, న‌వ‌దీప్‌, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు
మ్యూజిక్‌: థ‌మ‌న్‌
నిర్మాత‌లు: అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ‌
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: త‌్రివిక్ర‌మ్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో వీరి కాంబోలో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు హిట్ అవ్వ‌డంతో అల వైకుంఠ‌పుర‌ములో సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. థ‌మ‌న్ ఆల్బ‌మ్ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో స‌రికొత్త ఆల్బ‌మ్‌గా నిలిచింది. ఇక టీజ‌ర్లు, ట్రైల‌ర్లు కూడా సినిమాపై హైప్ పెంచాయి. ఈ సంక్రాంతికి భారీ పోటీ మ‌ధ్య వ‌స్తోన్న ఈ సినిమా ఆదివారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మ‌రి అల వైకుంఠ‌పురంతో ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టిందా ? అల వైకుంఠ‌పుర‌ములో అంచ‌నాలు అందుకుందా ? లేదా ? అన్న‌ది TJ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థేమిటంటే..
ఇక క‌థ‌లోకి వెళ్దాం.. సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన వాడు బంటు(అల్లు అర్జున్‌). ట‌బు, జైరాంల‌ది సంప‌న్న కుటుంబం. అయితే, మిడిల్‌క్లాస్ వాతావ‌ర‌ణంలో పెరిగిన బంటుకి, టబు, జైరాంల గొప్ప కుటుంబానికి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏమిటి..? అల‌.. వైకుంఠ‌పుర‌ములోకి బంటు ఎలా ప్ర‌వేశించాడు..? హీరోయిన్ పూజాహెగ్డెకు, బంటుకు మ‌ధ్య ప్రేమ ఎలా పుట్టింది..? ఆమె పెర్ఫామెన్స్ ఎలా ఉంది? త్రివిక్ర‌మ్ చేసిన మ్యాజిక్ చేశాడా..? లేదా..? బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన ఈ మూడో సినిమా వ‌ర్కౌట్ అయిందా..? కాలేదా..? ఇలా అనేక ఇంట్రెస్టింగ్ అంశాల‌ను తెలుసుకోవాలంటే మాత్రం తెర‌పైనే చూడాలి మ‌రి.

TJ విశ్లేష‌ణ :
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్-బ‌న్నీ కాంబోలో వ‌చ్చిన మూడో సినిమా అల‌.. వైకుంఠ‌పురములో. త్రివిక్ర‌మ్ చాలా గ్యాప్ తీసుకుని మ‌రీ తీసిన సినిమా ఇది. ఎప్ప‌టిలాగే.. క‌థామూలం పాత‌దే అయిన‌ప్ప‌టికీ త్రివిక్ర‌మ్ సినిమాను న‌డిపించిన తీరుమాత్రం అద్భుత‌మ‌నే చెప్పొచ్చు. మ‌రోసారి త‌న‌దైన మార్క్‌ను తెలుగు చిత్ర‌సీమ‌కు, ప్రేక్ష‌కుల‌కు చూపించాడు. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు ఎక్క‌డ కూడా త‌డ‌బాటు లేకుండా.. ప్ర‌తీ ఫ్రేమ్‌ను చాలా ఇంట్రెస్టింగా తెర‌కెక్కించ‌డంలో త్రివిక్ర‌మ్ స‌క్సెస్ అయ్యాడు. అయితే.. సినిమా విడుద‌ల‌కు ముందే పాట‌లు ఎంత హిట్ అయ్యాయో అంద‌రికీ తెలిసిందే. అయితే తెర‌పై వాటిని తీర్చిదిద్దిన తీరు కూడా అంత‌కంటే అద్భుతంగా ఉండ‌డం విశేషం.

త్రివిక్ర‌మ్ డైలాగ్స్‌, ఎమోష‌న‌ల్ సీన్స్‌, బ‌న్నీ న‌ట‌న‌.. ఇలా ప్ర‌తీ అంశం సినిమాను అంద‌మైన బొమ్మ‌రిల్లుగా మ‌లిచాయి. ఫ‌స్టాఫ్‌లో మంచి ఫన్ మరియు ఎమోషన్స్ తో కూడిన నరేషన్ తో చిత్రం నడిచింది.అలాగే అల్లు అర్జున్ కామికల్ టైమింగ్ మరియు త్రివిక్రమ్ డైలాగులు ఇప్పటి వరకు ప్రధాన బలంగా నిలిచాయి.మరి సెకండాఫ్‌లో మంచి బ‌ల‌మైన ఎమోష‌న్ సీన్లు, కుటుంబ విలువ‌లు, ఒక‌రి త‌ల‌రాత‌ను మ‌రొక‌రు ఎప్ప‌ట‌కీ డిసైడ్ చేయ‌లేరు అనే అంశాల‌తో పాటు ఈ సినిమాకు ముగింపు బ‌లాలుగా నిలిచాయి. పాత క‌థ‌, కొన్ని సార్లు పాత సినిమాల్లో చూసేసిన సీన్లు ఉన్నా అవి సినిమా విజ‌యానికి ప్ర‌తిబంధ‌కం కాద‌నే చెప్పాలి.

ఈ సినిమాలో న‌టీన‌టులంద‌రూ త‌మ పాత్ర‌ల‌కు నూటికి నూరుశాతం న్యాయం చేశారు. ఇందులో ప్ర‌ధానంగా బ‌న్నీ న‌ట‌న సూప‌ర్బ్‌. ఎన‌ర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టాడు. డైలాగ్ డెలివ‌రీలో, ఎమోష‌న్ సీన్స్‌లో, ఫైట్స్‌లో ఇలా.. అన్ని అంశాల్లోనూ బ‌న్నీ ఇర‌గ‌దీశాడు. ఇక పూజాహెగ్డె కూడా త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసింది. వీరిద్ద‌రి మ‌ధ్య కెమెస్ట్రీ మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది. ఇక కీలక పాత్రలు చేసిన జయరాం, టబు, సచిన్, రోహిణిలు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ వచ్చేది ఒక్క సన్నివేశమే అయినా బాగా నవ్విస్తాడు. అలాగే సుశాంత్ ది ముఖ్య పాత్రే అయినా పెద్దగా డైలాగ్స్, చెప్పుకోదగిన పెర్ఫార్మన్స్ ఉండదు. నివేత పేతురాజ్ చిన్న పాత్రలో బాగా చేసింది.

నవదీప్, రాహుల్ రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, హర్ష వర్ధన్ లు అక్కడక్కడా నవ్వించారు. కానీ సునీల్ పాత్రే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇక మ‌రీ ముఖ్యంగా సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. పాట‌ల‌తో ఎంత హిట్ కొట్టాడో.. సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్‌ను కూడా అంతే అందంగా అందించాడు. నిజంగా చెప్పాలంటే.. అది ఒక రేంజ్‌లో ఉంది. చివ‌రిగా.. పీఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు అద‌న‌పు బ‌లం.

ప్ల‌స్‌లు (+) :
– త్రివిక్రమ్ మార్క్ క్లాస్ కామెడీ
– హార్ట్ ట‌చ్చింగ్‌ ఎమోషనల్ సీన్స్
– అల్లు అర్జున్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్
– ఎంగేజింగ్ గా సాగే సెకండాఫ్
– థమన్ మ్యూజిక్ అండ్ పిఎస్ వినోద్ విజువల్స్
– సాంగ్స్ పిక్చ‌రేజేష‌న్‌

మైన‌స్‌లు (-) :
– ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం
– కొన్ని సీన్స్ ఆయన గత సినిమాని గుర్తు చేయడం
– సినిమా లెంగ్త్

ఫైన‌ల్‌గా…
బ‌న్నీ – త్రివిక్ర‌మ్‌కు ఇది ప‌రెఫెక్ట్ హ్యాట్రిక్ హిట్ సినిమా అయ్యింది. పాత క‌థే అయినా త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ అలాగే డైలాగ్స్,ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు బన్నీ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ లు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవగా త్రివిక్రమ్ ఎంచుకున్న థీమ్ లైన్ ఇది వరకే ఉన్నదే తీసుకోవడం కాస్త నిరాశ కలిగించే అంశం. ఓవ‌రాల్‌గా త్రివిక్రమ్ మరియు బన్నీ కెరీర్ లో ది బెస్ట్ సినిమా. ప్ర‌తి ఒక్క త‌ల్లి, దండ్రి పిల్ల‌ల‌తో క‌లిసి చూసి పండక్కు ఎంజాయ్ చేసే సినిమా ఇది.

ఫైన‌ల్ పంచ్‌:
అల వైకుంఠ‌పుర‌ములో అంద‌రూ అలా సినిమాకు వెళ్లాల్సిందే..

అల వైకుంఠ‌పుర‌ములో TJ రేటింగ్‌: 3.5 / 5

అల్లు అర్జున్ ‘అల వైకుంఠ‌పుర‌ములో’ రివ్యూ &రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts