‘ అల వైకుంఠ‌పుర‌ములో ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… బ‌న్నీ కుమ్మేశాడే..!

January 13, 2020 at 1:04 pm

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం భారీ అంచానాల మధ్య ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ‌న్నీ – త్రివిక్ర‌మ్ కాంబోలో ఇప్ప‌టికే వ‌చ్చిన జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు హిట్ అవ్వ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ అంచ‌నాల‌కు ఎంత మ‌త్రం త‌గ్గ‌కుండా అల సినిమా సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చిన‌బాబు, అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో బ‌న్నీ స‌ర‌స‌న పూజా హేగ్దే కథానాయకగా నటించింది.

కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మారధం పట్టారు. తోలిరోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబట్టిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అల తొలి రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రు.45 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. అధికారిక లెక్కలు రావాల్సి ఉండగా.. షేర్ రూ. 30 కోట్లు రాబట్టిందని అంచనా వేస్తున్నారు.

ఏరియాల వారీగా చూస్తే అల నైజాంలో 5 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 2 కోట్లు, ఈస్ట్-వెస్ట్‌లలో కలిపి 4.5 కోట్లు, గుంటూరు 3 కోట్లు, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో దాదాపు 3 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ నిపుణుల అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్‌లో రు. 5 కోట్లు, కేరళ, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో మూడున్నర కోట్లుపైగానే వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు, జయరాం, సునీల్, నివేతా పెతురాజ్, సుశాంత్, నవదీప్, తనికెళ్ళ భరణి, సముద్రఖని, రాజేంద్రప్రసాద్, స‌చిన్ కేద్క‌ర్‌ తదితరులు నటించారు. పి యస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు.

‘ అల వైకుంఠ‌పుర‌ములో ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… బ‌న్నీ కుమ్మేశాడే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts