బాక్సాఫీస్ వద్ద ‘ఆలా వైకుంఠపురములో ‘ దూకుడు, కలెక్షన్ల సునామీ…!

January 17, 2020 at 1:56 pm

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ తర్వాత వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఎన్నో ఆశలు ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ అల్లు అర్జున్ సూపర్ హిట్ కొట్టాడు.

అటు మాస్, ఇటు క్లాస్ ని ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. సంక్రాంతి విన్నర్ అల్లు అర్జున్ అనే టాక్ కూడా వినపడుతుంది. ఇక ఈ సినిమా విడుదల అయి అయిదు రోజులు అయినా సరే వసూళ్ళ పరంగా దూసుకుపోతుంది. అయిదో రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల 9.5 నుంచి 10కోట్లకు పైగా సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల వరకు సాధించిందని సిని వర్గాలు అంటున్నాయి.

ఇప్పటి వరకు 130 కోట్ల గ్రాస్, 96 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందని ట్రేడ్ పండితుల అంచనా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హవా కొనసాగుతుంది. వీకెండ్ కూడా రావడంతో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 17 శుక్రవారం, 18 శనివారం కావడంతో ఈ రెండు రోజులు ఇంకా సాధిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. కాగా ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణా నిర్మించారు.

బాక్సాఫీస్ వద్ద ‘ఆలా వైకుంఠపురములో ‘ దూకుడు, కలెక్షన్ల సునామీ…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts