జగన్ మా వాడే అంటూ…కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు!

January 27, 2020 at 12:45 pm

శాసనమండలి రద్దు బిల్లుని ఈరోజు అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఇక ఈ బిల్లుపై చర్చని డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణశ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి అంతా ఒక్కచోటే జరగకూడదనే ఉద్దేశంతో…సీఎం జగన్ మూడు రాజధానులని తీసుకొచ్చారని చెప్పారు. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి అంతా ఒక్కచోటే జరగకుండా, రాష్ట్రమంతా జరుగుతుందని అన్నారు. ఇక ఈ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అనేక కుట్రలు చేశారని, మండలిలో దారుణంగా వ్యవహరించారని, ఛైర్మన్‌ని డిక్టేట్ చేస్తూ, బిల్లులకు అడ్డు తగిలారని మండిపడ్డారు.

టీడీపీ నేతలు అమరావతిలో ఏ విధంగా ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలకు తెలుసనని అన్నారు. ఈ సందర్భంగా అనంతపురం మాజీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డిపై మంత్రి పరోక్ష విమర్శలు చేశారు. అనంతపురానికి చెందిన ఓ మాజీ మంత్రి జగన్…మా వాడే అంటూ మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న ఆ రెండు కులాలపైన విషం చల్లుతున్నారని మంత్రి విమర్శలు గుప్పించారు.

జగన్ మా వాడే అంటూ…కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts