ఆ రెండు దేశాల్లో బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన ‘ఆలా వైకుంఠపురములో ‘

January 13, 2020 at 1:31 pm

అల్లు అర్జున్‌ హీరోగా, త్రివిక్రమ్‌ డైరక్షన్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన‌ హ్యాట్రిక్‌ చిత్రం ‘అల వైకుంఠపురములో’. బన్నీ గత చిత్రం నా పేరు సూర్య డిజాస్టర్ కావటంతో బన్నీలో పాటు బన్నీ ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. సంక్రాంతి కానుక జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రెండు రాష్ట్రాల్లోతోపాటు అటూ ఓవర్సీస్‌లో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

అలాగే అమెరికా, న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కలెక్షన్స్‌తో రచ్చ చేస్తోంది. ఆ రెండు దేశాల్లో ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి. ముఖ్యంగా న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కనివిని ఎరుగని కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అక్కడ మూడు ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 34,625 డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ఫిల్మ్ క్రిటిక్ రమేష్ బాలా అభిప్రాయపడ్డారు.

వాస్త‌వానికి ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ ప్రీమియర్ షోలకు న్యూజిల్యాండ్‌లో 21,290 డాలర్లు మాత్రమే రాబట్టాయి. దీనిని బ‌ట్టీ బ‌న్నీ అల వైకుంఠ‌పురములో చిత్రం.. రాజమౌళి బాహుబలి రికార్డ్‌ను బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు అయింది. మరోవైపు ఒకరోజు ముందే విడుదలైన సరిలేరు నీకెవ్వరు అమెరికా ప్రీమియర్ కలెక్షన్స్ ని కూడా అల వైకుంఠపురంలో క్రాస్ చేసింది. కాగా, గతంలో బ‌న్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వచ్చిన సంగతి తెలిసిందే. గత సినిమాల వలే ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. త్రివిక్రమ్, బన్నీ ఈ సినిమాతో హ్యాట్రిక్ విజ‌యం అందుకున్నారు.

ఆ రెండు దేశాల్లో బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన ‘ఆలా వైకుంఠపురములో ‘
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts