బన్నీ పై మెగా వార్ స్టార్ట్ !

January 27, 2020 at 4:47 pm

అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ దూరం అయిందా…? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. వాస్తవానికి ముందు నుంచి అల్లు అర్జున్ ప్రవర్తన కాస్త భిన్నంగా ఉంటుంది. మెగా హీరోలు అందరూ చిరంజీవి చెట్టు నీడలో పెరిగితే అల్లు అర్జున్ మాత్రం తాను సొంతగా ఎదిగానని భావనలో ఉంటూ మెగా హీరోలు దూరంగానే ఉంటారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి మీద ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.

చిరంజీవి తర్వాత తానే మెగాస్టార్ అని కూడా ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ మధ్య వరుస హిట్లు కొడుతూ అల్లు అర్జున్ తాను తన తండ్రి సహకారంతో పైకి వచ్చానే గాని మెగాస్టార్ చిరంజీవి సహకారంతో కాదనే విషయాన్ని కొందరి వద్ద స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా కార్యక్రమంలో,

భాగంగా తనకు ఆర్మీ ఉందని మిగిలిన వారందరికీ ఫాన్స్ ఉంటారని, అల్లు అర్జున్ చెప్పిన మాట ఇప్పుడు మెగా ఫ్యామిలీలో కుంపటికి కారణమైంది. దీనిపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి వ్యాఖ్యలు కుటుంబాన్ని చీల్చే విధంగా ఉంటాయని దాని వల్ల ఇబ్బందులు పడతారు అని, అందరూ ఒకటి కాదనే అభిప్రాయం ఇతరుల్లో కలుగుతుందని ఆయన అన్నారట.

అదే విధంగా అల్లు అర్జున్ తో కూడా మెగా హీరోలు ఎవరు కలవద్దని, దూరంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. అలాగే ఎవరైనా సినిమాలు చేయాలనుకుంటే కొణిదల ప్రొడక్షన్స్ లో సినిమాలు చేయాలని చెప్పినట్టు సమాచారం. ఇక ఆన్లైన్ మార్కెట్ విషయంలోకూడా అల్లు అర్జున్ కి రామ్ చరణ్ ల మధ్య విభేదాలు వచ్చాయని, తన తండ్రి పెత్తనాన్ని రామ్ చరణ్ సహించడం లేదనే భావన అల్లు అర్జున్ లో ఉందని అందుకే మెగా ఫ్యామిలీకి అతను దూరంగా ఉంటున్నాడని, దానితోనే తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ అని చెప్పుకునే ప్రయత్నం చేశాడని అంటున్నారు.

బన్నీ పై మెగా వార్ స్టార్ట్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts