మెగా హీరోలు వద్దు ..తారక్,ప్రభాస్ ముద్దు

January 28, 2020 at 5:49 pm

ఇన్నాళ్లు మెగా హీరోగా అభిమాన నీరాజనాలు అందుకున్న అల్లు హీరో అర్జున్ అలియాస్ బన్ని సడెన్ గా తనకు మెగా హీరోలకు పడదు అన్నట్టుగా ప్రవర్తించడం చూస్తుంటే అదరికి షాక్ ఇస్తుంది. ఇన్నాళ్లు తన సినిమా ఏదైన వస్తే మెగా ఫ్యాన్సే తన ఫ్యాన్స్ అని చెప్పుకునే బన్ని ఇప్పుడు కొత్తగా తన ఆర్మీ మీద ఫోకస్ పెట్టాడు. తన సినిమా హిట్టు చేసేది తన ఆర్మీనే అంటున్నాడు. అంతేకాదు అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కాని నాకు ఆర్మీ ఉంది అంటూ కొద్దిగా బిల్డప్ ఇచ్చాడు.

ఇదిలాఉంటే మెగా ఫ్యాన్స్ ను గాలికొదిలేసిన బన్ని మెగా హీరోల గురించి కూడా మాట్లాడటం మానేశాడు. అడిగితేనే మెగా హీరోల ప్రస్థావన తెస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గురించి తప్ప మిగతా హీరోల గురించి బన్ని మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. రీసెంట్ గా అల వైకుంఠపురములో సక్సెస్ మీట్ లో కూడా ప్రెస్ వాళ్లు అడిగారనే చిరు గురించి మాట్లాడాడు. ప్రభాస్, తారక్ లను ఆకాశానికెత్తేస్తూ మాట్లాడుతున్న బన్ని మెగా హీరోల గురించి మాత్రం ముక్తసరిగా ఉంటున్నాడు.

మరి తనకు పోటీ వస్తున్నారన్న ఉద్దేశంతోనే బన్ని తమ ఫ్యామిలీ హీరోల గురించి మాట్లాడటం లేదని అంటున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ వింత ప్రవర్తనకు ఆయన ఫ్యాన్స్ కూడా అవాక్కయ్యేలా ఉన్నారు. అల హిట్ తో తన రేంజ్ ఇది అని ప్రూవ్ చేసుకున్న బన్ని సుకుమార్ సినిమాతో మరో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు.

మెగా హీరోలు వద్దు ..తారక్,ప్రభాస్ ముద్దు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts