ప్రైవేటు క్లాసులకు వెళ్తున్న బన్నీ

January 25, 2020 at 12:26 pm

సాధార‌ణంగా ఒక పాత్రకు త‌గిన‌ట్టుగా బాష‌, వేషం ఇలా అన్నీ మార్చుకోవాలి. అప్పుడే ప్రేక్ష‌కుల‌ను అక‌ట్టుకోగ‌లురు. ఈ నేప‌థ్యంలోనే కొంతమంది సెలబ్రిటీలు డ్యాన్స్ క్లాసులు తీసుకుంటే, కొందరు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందుతారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం చిత్తూరు యాస‌ కోసం శిక్ష‌ణ పొందుతున్నాడు. ప్ర‌త్యేక క్లాసులు కూడా తీసుకుంటున్నారు. అల వైకుంఠ‌పురం వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర్వాత బ‌న్నీ.. క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్వకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకోగా రెండో షెడ్యూల్‌ పిబ్రవరిలో ప్రారంభం కానుంది. అంతేకాకుండా రెగ్యులర్‌గా జరిగే ఈ షెడ్యూల్‌లోనే బన్ని పాల్గొననున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మంద‌న్న‌ బ‌న్నీ స‌ర‌స‌న న‌టించ‌నుంది. చిత్రంలో బన్నీ చిత్తూరు యాసతో మాట్లాడతారని, శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం. బన్నీ అభిమానుల టేస్ట్‌కి తగ్గట్టుగా సుక్కు ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నారట.

ఈ నేప‌థ్యంలోనే బ‌న్నీ చిత్తూరు యాస కోసం భాషా క‌స‌ర‌త్తు ప్రారంభించాడు. దీనికోసం రెండు డిక్షన్ మరియు భాష‌ కోచ్లను నియమించిన‌ట్టు తెలుస్తోంది. కాగా, అంతకుముందు రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ మాండలికంలో మాట్లాడి బ‌న్నీ అద‌ర‌గొట్టాడు. అప్పుడు కూడా ఆ యాసను సరిగ్గా పొందడానికి హాస్యనటుడు వేణు సహాయం తీసుకున్నారు. మ‌ళ్లీ ఇప్పుడు చిత్తూరు యాస కోసం చిత్తూరు ఆధారిత నటుల నుండి సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్రతిరోజూ ఉదయం బ‌న్నీ కార్యాలయంలో ఈ సన్నాహాలు జరుగుతున్నాయని స‌మాచారం.

ప్రైవేటు క్లాసులకు వెళ్తున్న బన్నీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts