విషాదంలో అల్లు అర్జున్ .. పరామర్శిస్తున్న సినీ పెద్దలు

January 23, 2020 at 10:40 am

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ చాలా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చిన చిత్రం అల‌వైకుంఠ‌పురంలో. ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు మంచి క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ జోరులో సంబ‌రాలు చేసుకుంటున్న అల్లుఅర్జున్‌కి ఇంట ఒక చేదు విష‌యం వినాల్సి వ‌చ్చింది. ఎంతో ఆనందంలో మునిగితేలుతున్న ఈ కుటుంబంలో అల్లుఅర్జున్ మేన‌మామ ముత్తం శెట్టి ప్ర‌సాద్ హ‌ఠాన్మ‌ర‌ణం పాల‌య్యాడు. ప్ర‌స్తుతం ఇది అల్లు కుటుంబంలో షాకింగ్‌గా మారింది. అనుకోకుండా వచ్చిన ఈ పిడుగు లాంటి వార్త ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబానికి చేదు విషాదంగా మారిపోయింది. అల్లు అర్జున్సు త‌ర్వాత చిత్రం సుకుమార్ కాంబినేషన్‌లో వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఆయ‌న‌ మేనమామ నిర్మాతగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌.

ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఆయ‌న మేన‌మామ‌ ముత్తంశెట్టి ప్రసాద్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీప్రొడ‌క్ష‌న్‌ పనుల్లోనే బిజీగా ఉన్న బన్నీకి మేనమామ మరణం అనుకోని షాక్ అనే చెప్పాలి. ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా అల్లు అర్జున్ తల్లి అల్లు నిర్మలా దేవికి అన్నయ్య. బన్నీకి పెద్ద మావయ్య ఈయన. చిన్నప్పటి నుంచి కూడా మేనమామ అంటే బ‌న్నీకి చాలా అమిత‌మైన ప్రేమ‌. ఇప్పుడు అనుకోకుండా జ‌రిగిన ఈ మరణవార్త అల్లు కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. విజయవాడలో జనవరి 22న ఈయన కన్నుమూసారు. ఈ విషయం తెలిసిన అల్లు కుటుంబం హుటా హుటిన విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. ఇండస్ట్రీలోని పలువురు పెద్ద‌లు కూడా ఈయన కుటుంబానికి సంతాపం తెలియచేసారు.

ఇక మ‌రి ఈ సంఘ‌ట‌న‌తో అల్లుఅర్జున్ సినిమా ఆగిపోనుందా లేక మైత్రీవాళ్ళు చేస్తారా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు కూడా అయిపోయాయి. మ‌రి ఇప్పుడు సుకుమార్ అల్లుఅర్జున్‌ల ప‌రిస్థితి ఏంటో. ఎంతో ఆనందంగా మంచి ఊపు మీద ఉన్న అల్లు కుటుంబానికి ఇది చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ మ‌ధ్య కాలంలో అల్లు అర్జున్ సినిమాలు ఏమీ రాక‌పోగా గ‌తంలో విడుద‌లైన సినిమాల‌న్నీ దాదాపుగా ఫ్లాప్ కావ‌డంతో చాలా కాలం త‌ర్వాత హిట్ వ‌చ్చింది. ఆ ఆనందాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయ‌క ముందే ఇలాంటి విష‌యం తెలియ‌డం పై ఆయ‌న ఫ్యాన్స్ కూడా చాల ఫీల‌వుతున్నారు.

విషాదంలో అల్లు అర్జున్ .. పరామర్శిస్తున్న సినీ పెద్దలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts