మండలి రద్దు: తీర్మానాన్ని కేంద్రానికి పంపిన ప్రభుత్వం

January 28, 2020 at 3:15 pm

ప్రభుత్వ ప్రయోజనాలని దెబ్బ తీసేలా పలు బిల్లులని అడ్డుకుంటున్న ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం..కేంద్రానికి పంపింది. సోమవారం రాత్రి మండలి రద్దుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందాక, అసెంబ్లీ ఆ తీర్మానంకు సంబంధించిన కాపీని, ఓటింగ్ వివరాలని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అదే వివరాలని రాష్ట్ర ప్రభుత్వం…కేంద్రానికి పంపింది.

ఆ తర్వాత కేంద్రం…. హోమ్ శాఖ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి పంపనుంది. ఇక కేంద్రం కేబినెట్ మండలి రద్దు బిల్లుపై ఆమోదముద్ర వేసి, లోక్ సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టనుంది. అయితే రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లుని ప్రవేశ పెడతారా లేక తర్వాత సమావేశాలకు పొడిగిస్తారనేది కేంద్రం చేతుల్లో ఉండనుంది. కాకపోతే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లుని ఉభయ సభల్లో ప్రవేశ పెట్టేలా చేసి మండలి రద్దుని చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. మరి చూడాలి కేంద్రం మండలి రద్దు విషయాన్ని ఎప్పటివరకు పొడిగిస్తారో?

మండలి రద్దు: తీర్మానాన్ని కేంద్రానికి పంపిన ప్రభుత్వం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts