ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై అదిరిపోయే ట్విస్ట్…

January 20, 2020 at 11:24 am

సోమవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మొత్తం ఏడు బిల్లులకు ఆమోదం తెలిపారు. అయితే ఇందులో ఎవరు ఊహించని విధంగా మూడు రాజధానులు అనే అంశం పేరు ఎత్తకుండా విశాఖలో పరిపాలనకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటుకు, కర్నూలు హైకోర్టు ఏప్రతుకు ఆమోదం తెలిపారు. అలాగే సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లు, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అమరావతిలో అసెంబ్లీ కొనసాగనుంది.
అయితే రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ అంశంపై టేబుల్ ఐటమ్‌గా చర్చించడానికి నిర్ణయించారు. విచారణను లోకాయుక్తకు అప్పచెప్పాలని కేబినెట్‌ నిర్ణయించింది. అటు పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు, 11 వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ, భూములు ఇచ్చిన రైతులకు కౌలు 15 ఏళ్లకు పెంచేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై అదిరిపోయే ట్విస్ట్…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts