మళ్లీ పల్లెబాట పట్టనున్న వైఎస్ జగన్ …

January 24, 2020 at 3:48 pm

భారీ మెజారిటీతో సీఎం జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు కావొస్తుంది. ఇక ఈ 8 నెలల పాలన కాలంలో సీఎం జగన్ ఊహించని విధంగా ప్రజలపై సంక్షేమ వరాలు కురిపించారు. అన్నీ ప్రాంతాలు, అన్నీ వర్గాలకు న్యాయం చేసేలా పథకాలు అమలు చేశారు. అయితే ఈ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరువయ్యాయి…ప్రజలు ఎంతవరకు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు సీఎంనే డైరెక్ట్‌గా రంగంలోకి దిగనున్నారు.

ఫిబ్రవరి 1 నుంచి పల్లెబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. రచ్చబండ తరహాలో గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజల అభిప్రాయాలని తెలుసుకొనున్నారు. గతంలో వైఎస్సార్ రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీఎం చేపట్టిన ఈ కార్యక్రమానికి అదే పేరు పెడతారా లేదా వేరే పేరు ఏమన్నా పెడతారేమో చూడాలి. ఇప్పటికే ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో పర్యటించి పథకాల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలని జగన్ అధికారులకు సూచించారు.

మళ్లీ పల్లెబాట పట్టనున్న వైఎస్ జగన్ …
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts