‘ అశ్వథ్థామ ‘ ప్రి రిలీజ్ బిజినెస్… నాగశౌర్య క్రేజ్ మామూలుగా లేదే..!

January 24, 2020 at 1:47 pm

యంగ్ హీరో నాగశౌర్యకు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో కనపడి క్రేజ్ ఉంది. ఛలో సినిమా తర్వాత శౌర్యకు మంచి క్రేజ్ వచ్చింది. యూత్లోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. నాగశౌర్య సినిమాలు మినిమం వసూళ్లు రాబట్టుకోవడం కూడా అతడి సినిమా బిజినెస్ విషయంలో ఉన్న క్రేజ్ చెపుతోంది.

ఇక నాగశౌర్య తాజా చిత్రం అశ్వథ్థామ సినిమా సైతం ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లతో మంచి హైప్ తెచ్చుకుంది. ఇటీవల పూరి జగన్నాథ్ రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూసిన వాళ్లు ఈ సినిమాతో నాగశౌర్య మరో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ దుమ్ము రేపుతోంది.

అశ్వథ్థామ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ రు.10 కోట్లు చేసింది. ఇక ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు రూ .6.20 కోట్లకు అమ్ముడయ్యాయి. నాగశౌర్య సినిమాకు ఈ రేంజ్లో టేబుల్ బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు. రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో కూడా దూసుకు పోతోంది. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్ అవుతోంది.

‘ అశ్వథ్థామ ‘ ప్రి రిలీజ్ బిజినెస్… నాగశౌర్య క్రేజ్ మామూలుగా లేదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts