‘ అశ్వథ్థామ ‘ ట్రైలర్: లేడీస్‌తో ఎమోషనల్‌గా… సస్పెన్స్‌గా.. గ్రిప్పింగా.. వావ్ కేకే…!

January 23, 2020 at 6:14 pm

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ముల్పూరి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `అశ్వథ్థామ`. ఇప్పటికే రిలీజ్ అయిన అశ్వథ్థామ టీజర్ గ్రిప్పింగ్‌గా ఉండడంతో సినిమాపై అంచనాలు ఎక్కువుగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను పూరి జగన్నాథ్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే మెయిన్ కంటెంట్‌ను ఎలివేట్ చేస్తూ చాలా ఇంట్రస్టింగ్‌గా కట్ చేశారనిపించేలా ఉంది.

ట్రైలర్లో ప్రధానంగా ఆడపిల్లలకు సంబంధించిన ఏమోసనల్ అండ్ సప్సెన్స్ ట్రాక్ తో పాటు.. యాక్షన్, లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ కూడా బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా అంచనాలను పెంచేసింది. ఛలో తర్వాత సొంత బ్యానర్లో శౌర్య చేస్తోన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా పూర్తి చేసుకుంటుంది.

ఈ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్ లు పనిచేయడం విశేషం. ఇటు ఫ్యామిలీ, రొమాంటిక్ టచ్ అటు థ్రిల్లర్ జోనర్ కలిపి తీసిన ఈ సినిమాకు పాటల కోసం శ్రీచరణ్ పాకాల ను తీసుకున్నారు. అలాగే సినిమాకు బ్యాక్ గ్రవుండ్ కీలకం కావడంతో జిబ్రాన్ ను తీసుకున్నారు. నిర్మాత ఉషా ముల్పూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట.

ఈ సినిమాలో సందర్భానుసారం మంచి యాక్షన్ సీక్వెన్స్ స్ ఉన్నాయట. మొదటిసారి ఈ చిత్రంలో నాగశౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. పోసాని కృష్ణమురళీ, సత్య, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీచరణ్, కెమెరా మనోజ్ రెడ్డి, ఎడిటర్ గారీ బిహెచ్, డైరెక్షన్ రమణ్ తేజ.

‘ అశ్వథ్థామ ‘ ట్రైలర్: లేడీస్‌తో ఎమోషనల్‌గా… సస్పెన్స్‌గా.. గ్రిప్పింగా.. వావ్ కేకే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts