పాత హీరోయిన్‌తోనే ఫిక్స్ అయిన బాల‌య్య‌..?

January 29, 2020 at 11:30 am

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌తున్న సంగ‌తి తెలిసిందే. `రూలర్` సినిమాతో మ‌రోసారి ఫేల్ అయిన బాల‌కృష్ణ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని క‌సితో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే సింహ, లెజెండ్ సినిమాలతో త‌న‌కు భారీ హిట్ అందించిన బోయ‌పాటినే మ‌రో సారి ఎంచుకున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 15 నుండి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

అలాగే బాల‌కృష్ణ కోసం ద‌ర్శకుడు బోయ‌పాటి శ్రీను మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రస్తుతం స‌మాజంలోని ప్రధాన‌మైన స‌మ‌స్య ఆధారంగా చేసుకుని బోయ‌పాటి శ్రీను ఈ సినిమాను చూపించ‌బోతున్నార‌ట‌. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో మొదట హీరోయిన్ గా కేథరీన్ థెరీసా నటించబోతుందని వార్తలు వచ్చినా .. చివరికీ కేథరీన్ థెరీసా ఈ సినిమాలో నటించట్లేదని తేలిపోయింది. యితే తాజగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో అంజలిని హీరోయిన్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను కథానాయికగా అంజలి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య అవకాశాలు తగ్గినా సరైన హిట్ కోసం ఎదురుచూస్తూ తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. అయితే తెలుగు నుంచి ఒక భారీ సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అంజలికి, బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని అంటున్నారు. కాగా, ఇప్పటికే అంజలి బాలయ్య సరసన ‘డిక్టేటర్’ అనే సినిమాలో కలిసి నటించింది. ఇక ఏదేమైనా ఈ సినిమాలోనూ కథానాయికగా అంజలి పేరు ఖరారైపోయినట్టేనని తెలుస్తోంది.

పాత హీరోయిన్‌తోనే ఫిక్స్ అయిన బాల‌య్య‌..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts