బాలయ్య, చిరుల మధ్య ఆసక్తికర వార్!

January 29, 2020 at 10:23 am

ఇటీవ‌ల సంక్రాంతి పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. అటు బ‌న్నీ.. ఇటు మ‌హేష్ బాక్సాఫిస్‌ను ఓ ఊపు ఊపేసారు. అయితే ఇప్పుడు ద‌స‌రా పోరుకు సిద్ధంమ‌వుతున్నారు ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోలు. వీరిలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక‌రైతే.. మెగ‌స్టార్ చిరంజీవి మ‌రొక‌రు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంతో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తమన్ సంగీతం అందిస్తున్నాడు. రాజకీయ నేపధ్యంలోనే ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఇప్ప‌టికే బాలయ్యా.. బోయపాటి సినిమా కోసం కసరత్తులు ప్రారంభించారు. ఇటివల బాలయ్య కూడా సరికొత్త లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. అలాగే ఈ మూవీ వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని.. ద‌స‌రా బ‌రిలో దిగే ఆలోచ‌న‌లో చిత్ర‌యూనిట్ ఉన్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ప‌ట్టాలెక్కింది.

రీసెంట్‌గా ఈ సినిమా ఒక పాటతో షూటింగ్ ప్రారంభమైంది. చిరంజీవి, త్రిషలపై ఈ పాటను పిక్చరైజ్ చేసారు. ఈ చిత్రాన్ని కొరటాల శివ దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. అయితే ఈ సినిమా కూడా అతి త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసుకుని ద‌స‌రా బ‌రిలో దిగేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే బాలయ్య, చిరు ల మధ్య ఆసక్తికర బాక్సాఫీస్ వార్ జరుగనుంది. మ‌రి ఈ ద‌స‌రా పోరులో ఎవ‌రు విన్న‌ర్ అవుతారో చూడాలి.

బాలయ్య, చిరుల మధ్య ఆసక్తికర వార్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts