రాజధాని ఉంటే అమరావతిలో,, లేదంటే రాయలసీమలో ఉండాలి

January 10, 2020 at 5:57 pm

ఏపీ రాజధాని ఉంటే అమరావతిలో లేదంటే రాయలసీమలో ఉండాలని మాజీ మంత్రి భూమ అఖిలప్రియ డిమాండ్ చేశారు. రాష్ర్ట విభజనతో ఇప్పటికే రాయలసీమ వాసులు ఎంతో నష్టపోయారని ఆమె ఆవేడన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయం పిచ్చోడిచేతిలో రాయిలా మారిందని విమర్శించారు. ఆ ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రాంతీయ విద్వేషాలు చెలరేగుతాయని, ఆప్పుడు జిల్లాకో రాజధాని పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. రాయలసీమకు హైకోర్టు వస్తే న్యాయవాదులకు లాభమని, సాధారణ ప్రజానీకానికి ఎలాంటి మేలు చేకూరదని అమె ముక్తాయింపునిచ్చారృ.

రాజధాని ఉంటే అమరావతిలో,, లేదంటే రాయలసీమలో ఉండాలి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts