మళ్ళీ మండలిని పునరుద్ధరిస్తానంటున్న బాబు

January 24, 2020 at 4:22 pm

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మండలి రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ జగన్ మండలిని రద్దు చేస్తే…మళ్ళీ తాను అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తానని అన్నారు. తమ ఎమ్మెల్సీలని ఏ మాత్రం అధైర్యపడవద్దని చెప్పామని, మండలి రద్దు కావడానికి దాదాపు సంవత్సరం పైనే పడుతుందని, ఈలోపు కొందరు ఎమ్మెల్సీ పదవి కాలం ముగుస్తుందని చెప్పారు. అయితే ఇంకా పదవి కాలం ఉన్నవారికి అధికారంలోకి రాగానే పూర్తి న్యాయం చేస్తానని అన్నారు.
సీఎం జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని, మూడు రాజధానులు ఏ మాత్రం సమంజసం కాదని చెప్పుకొచ్చారు. ప్రజలు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటున్నారని వ్యాఖ్యానించారు. మండలిలో ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని, ఆయన్ని వైసీపీ మంత్రులు దారుణంగా తిట్టారని, అయిన సరే ఆయన ధైర్యంగా నిలబడి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

అయితే చంద్రబాబు చెప్పినట్లు….వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రమే మండలిని పునరుద్ధరించగలరు. కానీ ఆయన అధికారంలోకి రావడమనేది 2024 ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి..మరి భవిష్యత్ లో జరుగుతుందో లేదో 2024 ఎలక్షన్స్ వరకు ఆగాల్సిందే . విషయం ఎలాగో తెలుసు కాబట్టి టీడీపీ ఎమ్మెల్సీలు తమ దారి తాము చూసుకొంటారో లేక చంద్రబాబు చెప్పినట్టు అవకాశం కోసం ఎదురు చూస్తారో కొన్ని రోజులో తేలనుంది.

మళ్ళీ మండలిని పునరుద్ధరిస్తానంటున్న బాబు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts