అసిస్టెంట్ పై డ్యాన్స్ మాస్టర్ లైంగిక వేధింపులు..!

January 28, 2020 at 1:12 pm

హాలీవుడ్ లో మొదలైన మీటూ ఎఫెక్ట్ టాలీవుడ్ వరకు పాకిందని తెలిసిందే. ఇక్కడ శ్రీ రెడ్డి ఆల్రెడీ కాస్టింగ్ కౌచ్ మీద పెద్ద యుద్ధమే చేసింది. అయితే అమ్మడి టార్గెట్ వేరే ఉండే సరికి ఆ వ్యవహారం చల్లబడ్డది. అయితే లేటెస్ట్ గా మరోసారి ఓ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అతను తన అసిస్టెంట్ తో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలుస్తుంది.

అయితే మొదట్లో క్యాజువల్ గా తీసుకోగా వేధింపులు ఎక్కువవడం వల్ల గణేష్ గురించి బయట పెట్టింది అతని అసిటెంట్ డ్యాన్స్ మాస్టర్. గణేష్ ఆచార్య తెలుగు, తమిళ, హింది సినిమాల్లో డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేస్తుంటాడు. బాలీవుడ్ మరో కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కూడా గణేష్ ఆచార్య మీద ఆరోపణలు చేశారు. కేవలం హీరోయిన్స్ కు మాత్రమే కాదు అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్స్ కు ఈ వేధింపులు తప్పడం లేదు.

ఈ ఆరోపణల మీద గణేష్ ఆచార్య మాత్రం ఇంకా స్పందించలేదు. ఆరోపణలు నిజం అని తేలితే మాత్రం గణేష్ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గణేష్ ఆచార్య నిజంగా అలాంటోడా కాదా అన్నది పోలీసుల విచారణలో తెలుస్తుంది.

అసిస్టెంట్ పై డ్యాన్స్ మాస్టర్ లైంగిక వేధింపులు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts