‘దర్బార్’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. కుమ్మేస్తున్న ర‌జినీ..

January 10, 2020 at 11:39 am

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు కేవలం తమిళనాడులో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక‌ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దర్బార్’. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో నిర్మించారు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్‌గా నటించిన ఈ చిత్రంలో నివేద థామస్, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషించారు.

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్డ్స్‌ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ రజినీ అభిమానులు విన్టేఙ్ స్టైల్ రజినీని చూస్తూ ఫుల్ ఫిదా అయ్యారు. మొదటి రోజు ఆంధ్ర – తెలంగాణలో హౌస్ ఫుల్స్ అయ్యాయి. బుకింగ్స్ యావరేజ్ అనిపించినా డైరెక్ట్ థియేటర్స్ ని ప్రేక్షకులు క్యూ కట్టారు. రజినీ మేనియా అన్నిచోట్లా కనిపించింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో కూడా రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అక్కడ భారీ వసూళ్లపై కన్నేసాడు రజినీ. ఈ నేప‌థ్యంలోనే దర్బార్ మొదటి రోజు ఆంధ్ర – తెలంగాణలో 4.51 కోట్ల షేర్ ని సాధించింది.

ఆంధ్ర – తెలంగాణలో 14.5 కోట్లకి అమ్ముడు పోయిన ఈ సినిమా మొదటి రోజే 30% రికవరీ చేసింది. అలాగే సెకండ్ డే కూడా మరో సినిమా లేకపోవడం వ‌ల్ల ద‌ర్బార్‌కు క‌లిసొచ్చింది. మ‌రోవైపు సోలో తమిళ సినిమా కావడంతో పొంగల్‌కు రచ్చ చేయడం ఖాయంగా మారిపోయింది. తమిళనాట అయితే రజినీకి తిరుగులేకుండా పోయింది.

రజినీకాంత్ ‘దర్బార్’ ఫస్ట్ డే ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:

నైజాం- 2.05 కోట్లు

సీడెడ్- 70 లక్షలు

గుంటూరు- 41 లక్షలు

ఉత్తరాంధ్ర- 45 లక్షలు

తూర్పు గోదావరి- 29లక్షలు

పశ్చిమ గోదావరి- 20 లక్షలు

కృష్ణా- 24 లక్షలు

నెల్లూరు- 17 లక్షలు
———————————————————
మొదటి రోజు మొత్తం షేర్- 4.51 కోట్లు
———————————————————

‘దర్బార్’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. కుమ్మేస్తున్న ర‌జినీ..
0 votes, 0.00 avg. rating (0% score)