ర‌జినీ ‘దర్బార్’ 2 డేస్ క‌లెక్ష‌న్స్‌.. బ్యాడ్ కాప్‌కి దెబ్బ ప‌డిందిగా..

January 12, 2020 at 5:17 pm

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం దర్బార్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న‌ భారీ ఎత్తున విడుదలైన విషయం తెల్సిందే. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో నిర్మించారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్‌గా నటించిన ఈ చిత్రంలో నివేద థామస్, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషించారు. వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.

70 సంవత్సరాల వయసులో 40 ఏళ్ళ యువకుడిగా రజిని చేసిన హంగామా అంతాఇంతా కాదు. అయితే రజినీ అభిమానులు విన్టేఙ్ స్టైల్ రజినీని చూస్తూ ఫుల్ ఫిదా అయ్యారు. దీంతో కేవలం ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చే స్టఫ్ ఉన్న చిత్రమని క్రిటిక్స్ తేల్చేసారు. అయినా కానీ దర్బార్ కు మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో ఢోకా లేకుండా పోయింది. రజినీ చిత్రానికి ఎప్పుడూ లేనంత రేంజ్ లో కలెక్షన్స్ ఉండడంతో సూపర్ స్టార్ అభిమానులు ఖుషీ అయిపోయారు.

వాస్త‌వానికి స్వతాహాగానే రజినీకాంత్ సినిమా అంటే అందరూ ఆసక్తి చూపుతారు, అలాగే దానికి సంక్రాంతి సీజన్ తోడవడంతో మొదటి రోజు ఆంధ్ర – తెలంగాణలో హౌస్ ఫుల్స్ అయ్యాయి. దర్బార్ మొదటి రోజు ఆంధ్ర – తెలంగాణలో 4.5 కోట్ల షేర్ ని సాధించింది. రెండవ రోజు చాలా వరకు డ్రాప్ అయ్యి అనుకున్న దానికంటే తక్కువ అనగా 1.35 కోట్ల షేర్ ని సాధించింది. ఇక ఆంధ్ర – తెలంగాణలో 14.5 కోట్లకి అమ్ముడు పోయిన ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో 40% రికవరీ చేసింది. అయితే సంక్రాంతి బ‌రిలో వ‌రుస‌గా సినిమాలు ఉండ‌డంతో మూడో రోజు ద‌ర్బార్ గ్రాఫ్ భారీ త‌గ్గే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

రజినీకాంత్ ‘దర్బార్’ టూ డేస్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:

నైజాం- 2.75 కోట్లు

సీడెడ్- 81 లక్షలు

గుంటూరు- 52 లక్షలు

ఉత్తరాంధ్ర- 59 లక్షలు

తూర్పు గోదావరి- 40 లక్షలు

పశ్చిమ గోదావరి- 35 లక్షలు

కృష్ణా- 30 లక్షలు

నెల్లూరు- 14.5 లక్షలు
—————————————————
రెండు రోజుల మొత్తం షేర్ – 5.86 కోట్లు
—————————————————

ర‌జినీ ‘దర్బార్’ 2 డేస్ క‌లెక్ష‌న్స్‌.. బ్యాడ్ కాప్‌కి దెబ్బ ప‌డిందిగా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts