‘డిస్కో రాజా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !

January 27, 2020 at 1:08 pm

మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. హై ఎనర్జీతో సినిమాలో రవితేజ చేసే యాక్షన్ అందరికీ నచ్చుతుంది. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు. అందుకు కార‌ణం ఈయ‌న వ‌రుస డిజాస్ట‌ర్లే అని చెప్పాలి. ఇక‌ 2019లో ఒక్క సినిమా కూడా చేయలేదు ఈయన. దానికి ముందు ఏడాది ట‌చ్ చేసి చూడు.. నేల‌ టికెట్టు.. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాల‌తో వ‌చ్చాడు మాస్ రాజా. రాజా ది గ్రేట్‌తో ఆ మధ్య హిట్ కొట్టిన ఈ హీరో.. ఆ త‌ర్వాత అదే టెంపో కొన‌సాగించ‌లేక‌పోయాడు. ఇక దాదాపు ఏడాదిన్నర తర్వాత `డిస్కో రాజా` సినిమాతో వచ్చాడు రవితేజ.

వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన డిస్కోరాజా సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ ముగ్గురు హీరోయిన్లు గా నటించారు. తమన్ సంగీత దర్శకత్వం వహించారు. ఇక విలన్ గా బాబీ సింహా రవితేజ తలపడ్డారు. ఈ చిత్రం ఎన్నో అంచ‌నాల మ‌ధ్య జ‌న‌వ‌రి 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పండగ సినిమాల తరువాత వస్తున్న తెలుగు సినిమా ఇదే. దీంతో ఈసినిమా ఏమాత్రం బావున్నా కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయం అని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి.

అయితే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ సినిమా యావరేజ్ అనిపించుకుంది. డైరెక్టర్ విఐ ఆనంద్ ఏదో సైన్ ఫిక్షన్ చెప్పబోతున్నారు అని చూపించి, రెగ్యులర్ రివెంజ్ డ్రామా చెప్పడంతో సినిమా కాస్త డ‌ల్ అయింది. ఇక వరల్డ్ వైడ్ సుమారు 22 కోట్లకి అమ్ముడు పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సత్తా చాటుకోవాల్సిన ఫస్ట్ వీకెండ్ లో కేవలం 6.83 కోట్ల షేర్ సాధించింది. అలాగే వీక్ డేస్ లో మ‌రీ కష్టమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ర‌వితేజ ఖాతాలో మ‌రో ప్లాప్ ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

‘డిస్కో రాజా’ ఆంధ్ర – తెలంగాణ ఫస్ట్ వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

నైజాం – 2.52 కోట్లు

సీడెడ్ – 81 లక్షలు

గుంటూరు – 41 లక్షలు

ఉత్తరాంధ్ర – 74 లక్షలు

తూర్పు గోదావరి – 41 లక్షలు

పశ్చిమ గోదావరి – 33 లక్షలు

కృష్ణా – 40.5 లక్షలు

నెల్లూరు – 19 లక్షలు
——————————————————-
ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్ – 5.83 కోట్లు
——————————————————-

రెస్ట్ అఫ్ ఇండియా + ఓవర్సీస్ – 1 కోటి

వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ షేర్ – 6.83 కోట్లు

‘డిస్కో రాజా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts