డిస్కో రాజా: ప్రేక్షకులు పోస్టు మార్టం చేసేశారు…ఫైనల్ టాక్..!

January 24, 2020 at 6:01 pm

మాస్ మహరాజ్ రవితేజ నటించిన డిస్కోరాజా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్లు, ఫస్ట్ షోలు కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమా గురించి ఎవరికి వాళ్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కు కాస్త కొత్తదనం తగిలించినట్టనిపిస్తుంది. డైరెక్టర్ వి.ఐ ఆనంద్ అనుకున్న పాయింట్ కొత్తగానే ఉన్నా..దాన్ని పూర్తిగా ప్రజెంట్ చేయడంలో తడబడ్డాడనే చెప్పాలి. సినిమా మొదలైన తీరు ఆకట్టుకుంటుంది. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ తో మంచి హై వస్తుంది.

ఇంటర్వెల్ చూసిన వాళ్లు విజిల్స్ వేసుకుంటూ పాప్ కార్న్ తింటూ సెకండాఫ్పై మంచి అంచనాలతో ఉంటారు. ఇక హీరోకి గతం గుర్తుకు వచ్చే ఎపిసోడ్ ను బాగా డిజైన్ చేశారు. అక్కడ మ్యూజిక్, యాక్షన్ సీన్ బాగా పండింది. అయితే తర్వాత మొదలైన సెకండాఫ్ మరీ రొటీన్ ఫ్లాష్ బ్యాక్ తో బోర్ కొట్టిస్తుంది. ఇక్కడ డైరెక్టర్ రాసుకున్న కథనం మరీ పేలవంగా తయారైందని ఎక్కువ మంది అంటున్నారు.

రవితేజ తన ఎనర్జీతో సేవ్ చేయాలని చూసినా.. మళ్లీ క్లైమాక్స్ కూడా అదే రకంగా సాగడంతో నిరాశపరుస్తుంది. ఓవరాల్ గా రవితేజ మార్కు ఎంటర్ టైన్మెంట్ ,టెక్నికల్ వాల్యూస్, మ్యూజిక్ కోసం ఓసారి ట్రై చేయవచ్చు. కానీ ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేసిన వాళ్లు డిజప్పాయింట్ అవుతారు. అయితే మాస్ మహరాజ్ అభిమానులు మాత్రం ఓ సారి చూడవచ్చని ఎక్కువ మంది చెపుతున్నారు. ఏదేమైనా డిస్కో రాజా మిక్స్ డ్ టాక్తోనే తన బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసిందనే చెప్పాలి.

డిస్కో రాజా: ప్రేక్షకులు పోస్టు మార్టం చేసేశారు…ఫైనల్ టాక్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts