రవితేజ ‘డిస్కో రాజా ‘ రివ్యూ&రేటింగ్

January 24, 2020 at 10:17 am

నటీనటులు: రవితేజ, పాయల్ రాజ్పుత్, నాభ నటేష్, తన్య హోప్
మ్యూజిక్: థమన్ ఎస్
నిర్మాత: రమేష్ తాళ్లూరి
దర్శకత్వం: విఐ ఆనంద్

వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న మాస్ మహారాజ్ రవితేజ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి తొలిసారిగా ఓ వైవిధ్య‌మైన రోల్‌లో న‌టించిన సినిమా డిస్కో రాజా. క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెర‌కెక్కిన డిస్కో రాజా. ర‌వితేజ డ‌బుల్ రోల్ చేసిన ఈ సినిమాలో నభ నటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా న‌టించారు. రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి డిస్కో రాజాగా మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ఏ మేర‌కు మెప్పించాడో ? TJ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
బ్రెయిన్ డెడ్ అయిన వాసు(రవితేజ)ని అక్కడ ఉన్న బయో కెమికల్ ల్యాబ్ వారు తీసుకొచ్చి తనపై ప్రయోగం చేస్తారు. వాసు త‌న గ‌తం, త‌న వాళ్లు ఎవ‌రో తెలుసుకునేందుకు ఓ ఎంపీతో ప‌బ్లిక్‌గానే గొడ‌వ ప‌డ‌తాడు. ఈ గొడ‌వ‌తో వాసు అంద‌రికి తెలుస్తాడు. అప్పుడే వాసుకి కావాల్సిన వాళ్ళతో పాటు చెన్నైకి చెందిన రౌడీ సేతు(బాబీ సింహా) కూడా వాసుని చంప‌డానికి వ‌స్తాడు. అసలు వాసుకి, డిస్కో రాజాకు ఉన్న లింక్ ఏంటి ? ఆ త‌ర్వాత క‌థ ఎలా మ‌లుపులు తిరిగి ? ఎలా ముగిసింది ? వాసు, డిస్కో రాజా వేర్వేరా ? ఒక‌రేనా ? వాసు గ‌తం ఎందుకు మ‌ర్చిపోయాడా ? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ సినిమా.

TJ విశ్లేష‌ణ :
తెలుగు సినిమా అభిరుచులు మారుతున్నాయి. వైవిధ్య‌మైన కాన్సెఫ్ట్‌ల‌కు ప్రేక్ష‌కులు బ్రహ్మ‌ర‌థం ప‌డుతున్నారు. డిస్కో రాజా కూడా అలాంటి కాన్సెఫ్ట్‌తో తెర‌కెక్కిన సినిమాయే. ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్‌తో స్టార్టింగ్ లోనే ఆసక్తికర నరేషన్ తో దర్శకుడు మొదలు పెట్టారు. ఎంచుకున్న పాయింట్ కొత్త‌గా ఉండ‌డంతో పాటు దానిని తెర‌కెక్కించిన తీరు చూస్తే ప్రేక్ష‌కులు ఖ‌చ్చితంగా థ్రిల్ అవ్వాల్సిందే. ఫ‌స్టాఫ్‌లో ర‌వితేజ ఎన‌ర్జిటిక్ పెర్పామెన్స్‌, డిస్కో రాజ్ గా యాటిట్యూడ్, మ్యానరిజమ్స్, డైలాగ్ మాడ్యులేషన్, స్టెప్స్ సింప్లీ సూపర్బ్. అటు వాసు పాత్ర‌లో కూడా మెప్పించాడు.

ఇలా ఫస్ట్ హాఫ్ సెకండాఫ్ పై ప్రేక్షకుడికి మరింత ఆసక్తిని పెంచేలా చేస్తుంది.అలా సెకండాఫ్ కు వచ్చేసరికి పూర్తిగా ఒక వింటేజ్ ఫీల్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఫ‌స్టాఫ్‌లో క‌థ‌నం ఎంత థ్రిల్లింగ్‌గా ఆస‌క్తిక‌రంగా ఉంటుందో సెకండాఫ్‌కు వ‌చ్చే స‌రికి కథ‌నం ట్రాక్ త‌ప్ప‌డంతో పాటు చ‌ప్ప‌ప‌డిన‌ట్టు అనిపిస్తుంది. ఫ‌స్టాఫ్ టెంపోను ద‌ర్శ‌కుడు సెకండాఫ్‌లో కంటిన్యూ చేయ‌డంలో త‌డ‌బ‌డ్డాడు.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే ర‌వితేజ గురించి పైన చెప్పుకున్నాం.. ఈ వ‌య‌స్సులోనూ ఇంత ఎన‌ర్జీతో న‌టించ‌డం ర‌వితేజ‌కే సాధ్య‌మైంది. ఇద్దరు హీరోయిన్లు పాయల్ రాజ్ పుత్ మరియు నభా నటేష్ రెండు షేడ్స్ కు తగ్గట్టుగా మంచి నటన కనబర్చారు.అలాగే ఇతర పాత్రల్లో నటించిన నరేష్,వెన్నెల కిషోర్ అలాగే వింటేజ్ టైం లో సునీల్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు.ముఖ్యంగా విలన్ రోల్ లో కనిపించిన బాబీ సింహా తనలోని విలన్ యాంగిల్ ను అద్భుతంగా చూపించారు.

డైరెక్టర్ విఐ ఆనంద్ కంటే కూడా టెక్నిక‌ల్‌గా ముగ్గురు గురించి చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని అండ్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీనాగేంద్ర తంగల. కార్తీక్ విజువల్స్ సినిమా రేంజ్‌ను పెంచాయి. అబ్బూరి రవి డైలాగ్స్ బాగున్నాయి. మరీ రవితేజ గత సినిమాల్లాంటి మాస్ డైలాగ్స్ కాదు, కానీ మాస్ అనిపించేలా డిస్కో రాజ్ పాత్రకి డైలాగ్స్ రాసారు. ఇక ఎడిటర్ శ్రవణ్ కటికనేని ఓవరాల్ గా ఓకే అనిపించినా అక్కడక్కడా కొంతవరకూ కత్తెర వేసి ఉండచ్చు.

డైరెక్ష‌న్ క‌ట్స్ :
దర్శకుడు వి ఐ ఆనంద్ కు తన రెండు సినిమాల‌తోనే అత‌డి స్పెషాలిటీ ఏంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. కొత్త క‌థ‌లు, క్రియేటివిటితో ఈ సినిమా లైన్ తీసుకున్నాడు. తన సినిమా అంటే ఒక కొత్త ప్లాట్ లైన్ అన్నట్టుగా ఈ సినిమాకు కూడా అలాగే ఎంచుకొని దాన్ని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు.కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి మాత్రం ఫస్టాఫ్ నుంచి కొనసాగిన టెన్స్ వాతావరణం సెకండాఫ్ లో కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది.

ఫైన‌ల్‌గా…
సైన్స్ ఫిక్ష‌న్ అని ఇండికేష‌న్స్ అందించి సినిమాకి రెట్రో క‌ల‌ర్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు వి.ఐ. ఆనంద్ సెకండాఫ్‌కు వ‌చ్చే స‌రికి రొటీన్ రివేంజ్ డ్రామాగా మార్చేశాడు. డిస్కోరాజ్ పాత్ర‌ను బాగా రాసుకున్నా సినిమాకు ప్రాణ‌మైన అస‌లు క‌థ‌ని గాలికి వ‌దిలేసిన‌ట్టు అర్థ‌మౌతోంది. ఫ‌స్టాఫ్‌తో అంచ‌నాలు పెంచేసినా సెకండాఫ్ దెబ్బ‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బిలో యావ‌రేజ్ / యావ‌రేజ్ మార్కుతో స‌రిపెట్టుకునే ఛాన్సులే ఉన్నాయి.

డిస్కో రాజా… యావ‌రేజ్ రాజానే

డిస్కో రాజా TJ రేటింగ్‌: 2.75 / 5

రవితేజ ‘డిస్కో రాజా ‘ రివ్యూ&రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts