కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ ప్రీమియర్ షో టాక్

January 15, 2020 at 11:24 am

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఎంత మంచి వాడవురా. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్ గా నటించింది. బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రధానంగా క్లాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది అని ప్రేక్షకులు అంటున్నారు. ఇప్పటి వరకు ఎక్కువ మాస్ కథలు చేసిన కళ్యాణ్ రామ్ ఈసారి కొత్తగా కుటుంబ కథా చిత్రం తో ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేశాడు.

శతమానం భవతి లాంటి హిట్ సినిమాలు తీసిన సతీష్ వేగేశ్న ఈ సినిమాను పూర్తిగా కుటుంబ సమేతంగా చూసే విధంగా తెరకెక్కించాడు. ప్రతీ సీన్ కూడా ఆ విధంగానే తెరకెక్కించారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ నటన విశేషంగా ఆకట్టుకుంది. సెంటిమెంట్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. పాటల పరంగా కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. మెహరీన్ హీరోయిన్ గా

అటు గ్లామర్ పరంగా ఇటు నటన పరంగా కూడా ఆకట్టుకుంది. సినిమాలో కామెడీ కూడా ఎక్కడ అతిగా లేదని ప్రేక్షకులు అంటున్నారు. సినిమాకు సతీష్ దర్శకత్వంతో పాటు కథ కూడా ప్లస్ పాయింట్ అంటున్నారు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సినిమా తీసినట్టు ఉందనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. సెంటిమెంట్ సీన్లు మీద ఎక్కువగా దృష్టి పెట్టారని అలాగే కుటుంబం తో చూసే వారి కోసం సినిమా తీసిన ఉంటుందని కొందరు అంటున్నారు.

కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ ప్రీమియర్ షో టాక్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts