జ‌న‌సేన‌పై కేటీఆర్ సూప‌ర్ సెటైర్‌..

January 17, 2020 at 3:14 pm

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల‌న్ని జ‌న‌సేన – బీజేపీ పొత్తు చుట్టూనే న‌డుస్తున్నాయి. అంద‌రి అంచ‌నాల‌కు భిన్నంగా మూడు రోజుల పాటు ఢిల్లీ టు గ‌ల్లీ వ‌ర‌కు బీజేపీ నేత‌ల చుట్టూ చ‌క్కెర్లు కొడుతోన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌స్పెన్స్‌కు తెర‌దించుతూ ఎట్ట‌కేల‌కు బీజేపీతో క‌లిసి తాను న‌డుస్తాన‌ని చెప్ప‌క‌నే చెప్పేశారు. ఇక ఎన్నిక‌లు ఎప్పుడో నాలుగున్న‌రేళ్ల త‌ర్వాత ఉన్నాయి. అప్ప‌టి వ‌ర‌కు బీజేపీ -జ‌న‌సేన బంధం నిల‌బ‌డుతుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ రెండు పార్టీల పొత్తుపై ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేత‌ల నుంచి తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఈ విమ‌ర్శ‌లు ఇలా ఉండ‌గానే బీజేపీ – జ‌న‌సేన పొత్తుపై తెలంగాణలో టీఆర్ఎస్ నేత‌లు సైతం ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్… ఏపీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. భ‌విష్య‌త్తులో జ‌న‌సేన అంత‌ర్జాతీయ పార్టీ కూడా కావొచ్చేమో ? అని చాలా వ్య‌గ్యంగా మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ ఏం చేస్తే మాకేం సంబంధమన్న కేటీఆర్… ఆయన రాజకీయాలపై ఏపీ ప్రజలు చూసుకుంటారని అన్నారు. ఇక ఏపీలో జ‌రుగుతోన్న రాజ‌ధాని అమ‌రావ‌తి ర‌గ‌డ‌పై కూడా ఆయ‌న స్పందించారు. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డ్డాక తాము 33 జిల్లాలు ఏర్పాటు చేశామ‌ని… చిన్న ఆందోళ‌న‌లు కూడా రాలేద‌ని.. అయితే ఏపీలో రాజధాని మారుస్తామంటే ఆందోళనలు చేస్తున్నారని.. అక్క‌డ రాజ‌ధాని మార్పుపై ఎందుకు ? ఇంత ఆందోళ‌న వ‌స్తుందో ? ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కూడా కేటీఆర్ చెప్పారు.

జ‌న‌సేన‌పై కేటీఆర్ సూప‌ర్ సెటైర్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts