ఆ సెంటిమెంట్‌ను బ‌ద్ద‌లుకొట్ట‌బోతున్న ఎన్టీఆర్‌..?

January 20, 2020 at 10:50 am

నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌ టాప్‌ హీరోగా వెలుగొందుతున్న నటుడు ఎన్టీఆర్‌. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్‌ మూవీలో రామ్‌ చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే.

ఇక వీరిద్దరి పాత్రలను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తయిన తరువాత ఎన్టీఆర్‌ చేయబోయే సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది. సాధార‌ణంగా రాజమౌళితో సినిమా అంటే ఏ హీరోకైనా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఖాయం. జక్కన్న ట్రీట్మెంట్ వలన ఆ హీరో క్రేజ్ రెట్టింపు అవుతుంది. కానీ చిక్కంతా ఆ తర్వాతే ఉంటుంది. అదేంటంటే.. రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు ఆ తరువాత సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కావు.

ఈ ఆభిప్రాయానికి బలాన్ని చేకూర్చే సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ప్రజెంట్ రాజ‌మౌళితో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నఎన్టీఆర్ ఆ అభిప్రాయాన్ని బద్దలుకొట్టాలనే ఉద్దేశ్యంతో నెక్ట్స్ మూవీని పకడ్బంధీగా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. జ‌క్క‌న చిత్రం త‌ర్వాత‌ త్రివిక్రమ్ లేదా కొరటలా శివల్లో ఎవరో ఒకరితో తన తర్వాతి చిత్రాన్ని చేయాలనుకుంటున్నారు ఎన్టీఆర్. కాగా, గ‌తంలో ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఎన్టీఆర్‌కు హిట్ ఇచ్చారు. మ‌రి ఈ సారి కూడా అదే జ‌రిగితే ఆ బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన‌వాడిగా నిలుస్తాడు ఎన్టీఆర్‌.

ఆ సెంటిమెంట్‌ను బ‌ద్ద‌లుకొట్ట‌బోతున్న ఎన్టీఆర్‌..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts