ఉత్తమ్‌,రేవంత్‌లకు చెక్: కారు ఖాతాలోకి హుజూర్ నగర్..కొండంగల్ కూడా

January 25, 2020 at 10:31 am

ఒకేసారి ఇద్దరు బడా కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ చెక్ పెట్టింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డిల సొంత నియోజకవర్గాలైన హుజూర్ నగర్, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో కారు దుమ్ములేపింది. ఉత్తమ్ సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. అటు రేవంత్ నియోజకవర్గమైన కొడంగల్ మున్సిపాలిటీలో కూడా టీఆర్ఎస్ సత్తా చాటింది. మున్సిపాలిటీని కూడా కారు సొంతం చేసుకునే దిశగా వెళుతుంది.

ఇక రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు కారు ఖాతాలోనే పడ్డాయి. ఆందోల్, బాన్సు వాడ, ధర్మపురి, వైరా, పెద్దపల్లి, డోర్నకల్ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించింది. అటు ర్ధన్నపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. మొత్తం 12 వార్డుల్లో అత్యధికంగా టీఆర్ఎస్ 8 వార్డులు గెలుచుకుంది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. 2 వార్డుల్లో కాంగ్రెస్ సభ్యులు గెలవగా.. బీజేపీ 1, స్వతంత్రులు 1 వార్డు గెలిచారు.

అయితే ఒక్కసారి మొత్తం ఫలితాలని చూస్తే…9 కార్పొరేషన్‌ల్లో 2, 120 మున్సిపాలిటీల్లో 41 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక మిగతా చోట్ల కూడా కారు హవా కొనసాగుతుంది.

ఉత్తమ్‌,రేవంత్‌లకు చెక్: కారు ఖాతాలోకి హుజూర్ నగర్..కొండంగల్ కూడా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts