వైఎస్సార్ వల్లే పప్పునాయుడు ఎమ్మెల్సీ అయ్యాడు….

January 23, 2020 at 4:52 pm

టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌లపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రికొడుకులు కలిసి మండలి వ్యవస్థని భ్రష్టు పట్టించారని, కావాలనే మూడు రాజధానుల బిల్లుని ఆపారని అన్నారు. ఇక మండలి ఛైర్మన్ షరీఫ్ కూడా రూల్స్ పాటిస్తానని చెప్పి…చివరికి చంద్రబాబు డైరక్షన్‌లో బిల్లులని సెలక్ట్ కమిటీకి పంపారని మండిపడ్డారు. అయితే మండలి అంటే పెద్దల సభ అని, కానీ అక్కడ టీడీపీ సభ్యుల్లో పెద్దలు ఎవరు లేరని, అందరూ రౌడీలు, దద్ద్మమ్మలే ఉన్నారని అన్నారు.

ఇక లోకేశ్ కూడా పెద్దల సభకు రావడం సిగ్గు చేటు అని, కొడుకుని గెలిపించుకోలేని బాబు, దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి సభకు తీసుకొచ్చాడని వ్యాఖ్యానించారు. అయితే అప్పటిలో మండలితో చాలా ఇబ్బందుకు ఉన్నాయని తెలిసి ఎన్టీఆర్ దాన్ని రద్దు చేశారని, కానీ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి కొందరు పెద్దలు కావాలనే ఉద్దేశంతో వైఎస్సార్ మండలిని పునరుద్ధరించారని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ దయ వల్లే టీడీపీలో ఎమ్మెల్సీలు అంతమంది ఉన్నారని, ఆఖరికి పప్పు నాయుడు కూడా వైఎస్సార్ నిర్ణయం వల్లే ఎమ్మెల్సీ స్థానంలో ఉండగలిగాడని అన్నారు.

వైఎస్సార్ వల్లే పప్పునాయుడు ఎమ్మెల్సీ అయ్యాడు….
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts