మందుబాబులు బీర‌కాయ తింటే ఏం అవుతుందో తెలుసా..?

January 8, 2020 at 6:36 pm

సాధార‌ణంగా బీర‌కాయ తెలియ‌ని వారుండ‌రు. బీరకాయ రుచి అమోఘం. దీనిలో పోషకవిలువలు కూడా అధికంగా ఉంటాయి. బీరకాయలు ఈ సీజన్‌ లో చాలా విరివిగా దొరుకుతుంది. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీరకాయలో ఐరన్‌, రిబోఫ్లేవిన్‌, సి విటమిన్‌, మెగ్నీషియం, థయామిన్‌తో పాటు అనేక రకాల ఖనిజ లవణాలుంటాయి. అయితే మ‌ద్యం సేవించే వారు బీరకాయ తిన‌డం వ‌ల్ల ఏం అవుతుందో తెలుసా..? తెలియ‌క‌పోతే ఓ సారి లుక్కేసేయండి..!

బీరకాయల్లోని పెప్టయిడ్స్, ఆల్కలాయిడ్లూ రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకూ తోడ్పడతాయి. అలాగే బీర‌లో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం, పైల్స్ సమస్యతో బాధ పడేవారికి చక్కని ఔషధంలా పనిచేస్తుంది. ఇక బీరకాయల్లో రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షించ‌డంలో బీర ఎంతో గ్రేట్‌గా ప‌ని చేస్తుంది. సో.. మ‌ద్యం సేవించేవారు బీర‌కాయ తిన‌డం వ‌ల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. మరియు మధ్యం మత్తు వైపు వెళ్ళకుండా తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

అంతేనా.. బీర‌తో ఇంకా బోలెడ‌న్నీ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. బీరలోని మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడంద్వారా చక్కెరవ్యాధినీ నియంత్రిస్తుంది. అల్సర్లు, కడుపులో మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ మందులా పనిచేస్తుంది. బీరకాయల్లోని విటమిన్‌ బి6 ఎనీమియాను నివారిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ వారీ డైట్‌లో దీనిని చేర్చుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే బీటాకెరోటిన్‌ కంటిచూపును కూడా మెరుగుపరుస్తుంది.

మందుబాబులు బీర‌కాయ తింటే ఏం అవుతుందో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts